ఆంధ్రప్రదేశ్‌

సీఎం హెచ్చరికతో యంత్రాంగం పరుగులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం: జ్వరాలతో జిల్లా ప్రజలు వణికిపోతున్నారు. యంత్రాంగం కనీసం స్పందించలేదు. సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జోక్యం చేసుకుని వీడియో కాన్ఫరెన్స్‌లో యంత్రాంగాన్ని కఠినంగా హెచ్చరిస్తే గానీ మత్తు వదల్లేదు. జిల్లాలో హెల్త్ ఎమర్జెన్సీ విధిస్తున్నానని, తక్షణమే అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు సెలవులు రద్దు చేసుకుని విధులకు హాజరుకావాలని హెచ్చరించడంతో యంత్రాంగం కదిలింది. కలెక్టర్ సైతం సీఎం ఆదేశాల తరువాతే క్షేత్ర పర్యటన చేస్తూ యంత్రాంగాన్ని సన్నద్ధం చేశారు. డెంగీ వ్యాధితో ఒక వ్యక్తి మృత్యువాత పడగా, ఒక ప్రైవేటు ఆసుపత్రి యాజమాన్యం రెండు లక్షలు డిమాండ్ చేసి, రోడ్డెక్కింది. అయినా యంత్రాంగం స్పందించిన దాఖలాల్లేవు. సీఎం చంద్రబాబు వీడియో కాన్ఫరెన్స్ జరిగి 24 గంటలు గడవక ముందే వైద్య ఆరోగ్యశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ పూనం మాలకొండయ్య ఆఘమేఘాలపై విశాఖ చేరుకుని విశాఖ నగరం, జిల్లాలో ఆదివారం విస్తృతంగా పర్యటించారు.
తొలుత జీవీఎంసీ పరిధిలో పర్యటించిన ఆమె అర్బన్ హెల్త్ సెంటర్ల నిర్వహణ, వైద్యులు, సిబ్బంది పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ముఖ్యంగా వార్డుల్లో పారిశుద్ధ్య పనుల నిర్వహణపై కూడా ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. జీవీఎంసీ కమిషనర్ హరినారాయణన్, కలెక్టర్ ప్రవీణ్‌కుమార్‌తో కలిసి నగరంలో పర్యటించి పారిశుద్ధ్య పనులపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రజారోగ్య విభాగంతో పాటు వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న అర్బన్ హెల్త్ సెంటర్లలో సిబ్బంది తీరుపై మండిపడ్డారు. అనంతరం ఆమె సబ్బవరం మండలం లగిశెట్టిపాలెం గ్రామాన్ని సందర్శించి అక్కడ నెలకొన్న అపాశుద్ధ్య పరిస్థితులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
డెంగీ జ్వరానికి గురై కోలుకుంటున్న వ్యక్తి కుటుంబాన్ని పరామర్శించి, ఇంటి పరిసరాల్లో వాతావరణాన్ని పరిశీలించారు. అంతకు ముందు సబ్బవరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించిన ఆమె రోగులను పరామర్శిస్తూ ఆరోగ్య పరిస్థితులు, అందుతున్న సేవలపై ఆరా తీశారు. ఆసుపత్రి నిర్వహణ ఘోరంగా ఉండటంతో వైద్యాధికారి తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పనితీరు మెరుగుపరచుకోకుంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. దీనిపై ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ మూర్తి స్పందిస్తూ పీహెచ్‌సీలో వైద్య సేవలు సరిగా అందకపోవడంతో గోపాలపట్నం వెళ్లిపోతున్నారన్నారు. అనంతరం ఆమె కలెక్టర్, డీఎంహెచ్‌ఓ తదితరులతో సమీక్ష నిర్వహించారు. గ్రామాల్లో అధికారులు విధి నిర్వహణలో అలసత్వం ప్రదర్శిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. అంతకు ముందు ఆమె జీవీఎంసీ పరిధిలోని 13వ వార్డు సీతంపేట, 21వ వార్డు నరసింహనగర్, 34వ వార్డు పెదజాలరిపేట ప్రాంతాల్లో పర్యటించారు.
చిత్రం..సబ్బవరం ఆసుపత్రిలో రోగులను సేవలపై విచారిస్తున్న
వైద్య ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి పూనం మాలకొండయ్య