తెలంగాణ

భలే మంచి చౌక బేరం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంగారెడ్డి, సెప్టెంబర్ 9: రాష్ట్ర ప్రభుత్వం ముందస్తు ఎన్నికలకు సిద్ధమైన వేళ.. ఆయా నియోజకవర్గాలు మంచి బేరసారాలకు నిలయంగా మారాయ. రాష్ట్రంలోని 105 అసెంబ్లీ స్థానాలకు గులాబి దళపతి అభ్యర్థులను ప్రకటించిన విషయం తెలిసిందే. ఉద్యమ కాలం నుంచి పార్టీలో ఉంటూ వస్తున్న నాయకుల్లో ఈసారి అసెంబ్లీ స్థానాలకు పోటీ చేయడానికి ఎన్నో ఆశలు పెట్టుకుని కూర్చున్నారు. ఈ నేపథ్యంలో తమవంతు ప్రయత్నాలు ముందుగానే ప్రారంభించుకున్నారు. రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిణామాలతో ప్రభుత్వం ముందస్తు ఎన్నికలకు సిద్ధమైన విషయం తెలిసిందే. అసెంబ్లీని రద్దు చేస్తూ ఆయా నియోజకవర్గాలకు సంబంధించిన అభ్యర్థులను ప్రకటించారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో పది అసెంబ్లీ సెగ్మెంట్లుండగా వీటిలో జహీరాబాద్ ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం మినహా అన్నింటికీ అభ్యర్థులను ఖరారు చేస్తూ పేర్లను ప్రకటించారు. టీఆర్‌ఎస్ రాష్ట్ర అధ్యక్షుడు కేసీఆర్ ప్రాతినిథ్యం వహిస్తున్న గజ్వేల్, హరీష్‌రావు ప్రాతినిథ్యం వహిస్తున్న సిద్దిపేట అసెంబ్లీ నియోజకవర్గాలను మినహాయిస్తే అన్ని నియోజకవర్గాల్లో అంతర్గత గ్రూపు తగాదాలు నెలకొన్నాయి. ఇప్పటికే పటన్‌చెరు నియోజకవర్గంలో గ్రూపు విభేదాలు రచ్చకెక్కాయి. సంగారెడ్డి నియోజ్కవర్గంలో సైతం ముఠాలు ఏర్పడ్డాయి. నారాయణఖేడ్ నియోజకవర్గంలో సైతం సిట్టింగ్ ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డిని విభేదిస్తూ ఒక వర్గం పని చేస్తోంది. అందోల్ నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే బాబుమోహన్‌కు టికెట్ కేటాయించకుండా కొత్త అభ్యర్థిని రంగంలోకి దింపడంతో నేతల్లో కొంతమేరకు అసంతృప్తి తొలగిపోయినట్లు కనిపిస్తోంది. మెదక్, దుబ్బాక, నర్సాపూర్ నియోజకవర్గాల్లో కూడా అసంతృప్తి నేతలు చాలామంది ఉన్నారు. జహీరాబాద్ నియోజకవర్గానికి అభ్యర్థిని ప్రకటించకపోవడంతో పార్టీ శ్రేణులను అయోమయానికి గురి చేస్తోంది. సీటు సిట్టింగులకే అయినా అసంతృప్తి నేతలను సంతోషపర్చడానికి అభ్యర్థులకు తలకుమించిన భారంగా మారింది. అసంతృప్తితో ఉన్న వారిని నయానో భయానో తమవైపు తిప్పుకోవడానికి అభ్యర్థులు బేరసారాల పనిలో నిమగ్నమైనట్లు తెలుస్తోంది. గ్రామ స్థాయలో సైతం ఇలాంటి తంటాలను ఎదుర్కోవాల్సిన పరిస్థితులు ఉన్నాయి. గతంలో ఎన్నికల షెడ్యూల్ ఖరారై, నోటిఫికేషన్ వెలువడితే కానీ రాజకీయం వేడెక్కేది కాదు. ప్రస్తుతం అందుకు భిన్నమైన వాతావరణం ఏర్పడింది. ఎలక్షన్ కోడ్ అమల్లోకి వస్తే ఎలాంటి నగదు పంపకాలు చేయకూడదు.
డబ్బులు చేతులు మార్చకూడదు. పైగా అభ్యర్థుల రోజువారి ఖర్చుల వివరాలను ఎప్పటికప్పుడు ఎన్నికల అధికారులకు సమర్పించాల్సి ఉంటుంది. ప్రభుత్వాన్ని రద్దు చేయడంతో ఎన్నికల షెడ్యూల్ ఖరారు కావడానికి చాలా సమయం ఉంది. పైగా అభ్యర్థులను ప్రకటించడంతో ఆశావహులంతా నిరాశ నిస్పృహలకు గురవుతూ బహిరంగ విమర్శలకు దిగుతున్నారు. టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ మొదలుకుని సిట్టింగ్ ఎమ్మెల్యేల పనితీరును ఎండగడుతున్నారు. అసంతుష్ట నేతలను ప్రసన్నం చేసుకోవడానికి నానా తంటాలు పడాల్సిన దుస్థితి టీఆర్‌ఎస్ అభ్యర్థులకు నెలకొంది. ఇదే అదనుగా చేసుకుని కొంతమంది నేతలు బేరాలకు దిగుతున్నట్లు తెలుస్తోంది. ఎంతమంది అలకపాన్పునెక్కితే అన్ని వరహాలు చేతుల్లో పడుతాయన్న ఆశలు కనిపిస్తున్నాయి. కాగా, అలిగిన నేతలను తమవైపు తిప్పుకోవడానికి అభ్యర్థులకు కూడా మంచి సమయమే ఉందని చెప్పడం అతిశయోక్తి కాదు. మొత్తంమీద పెద్ద మొత్తంలో డబ్బులను వెచ్చించుకుని అలిగిన నేతలను మచ్చిక చేసుకునే పనిలో సిట్టింగ్ ఎమ్మెల్యేలు నిమగ్నమైనట్లు తెలుస్తోంది. ఇక గ్రామాల వారిగా తమ పార్టీ నేతలను, కార్యకర్తలను కలుసుకుని ఎన్నికలకు ఏ విధంగా సిద్ధం కావాలి అన్న వ్యూహరచనలు కూడా చేసుకుంటున్నారు.