రాష్ట్రీయం

నిస్వార్ధ సేవతోనే దేశ నిర్మాణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరంగల్, సెప్టెంబర్ 9: రైతు సమస్యలు రాజకీయాల ద్వారానే సాధ్యమనుకుంటే కచ్చితంగా రాజకీయాల్లోకి వస్తానని సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ అన్నారు. నగరంలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ఆడిటోరియంలో ఆదివారం సేవా భారతి ఆధ్వర్యంలో నిర్వహించిన జాతి నిర్మాణంలో సేవ-మన పాత్ర అనే అంశంపై జరిగిన సెమినార్‌లో లక్ష్మీనారాయణ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ప్రజలే తమ అవసరాలకు అనుగుణంగా ఎన్నికల మెనిఫెస్టోను తయారు చేసుకోవాలని కోరారు. వ్యవసాయంలోకి యువతరాన్ని తీసుకు రావాలని, ఎందుకంటే భారత దేశం వ్యవసాయ ఆధారిత దేశం అని ఆయన తెలిపారు. నిస్వార్ధ సేవా కార్యక్రమాల ద్వారానే దేశ నిర్మాణం జరుగుతుందని లక్ష్మీనారాయణ అన్నారు. ముక్తి కొరకు సేవ అనే ఆలోచనా పద్ధతి భారతీయ సంస్కృతిలోనే నిగూఢంగా ఉందన్నారు. సామాజాకి మార్పుకు సేవ మాధ్యమంగా మారుతుందన్నారు. దేశ వ్యాప్తంగా సేవా భారతి చేస్తున్న సేవా కార్యక్రమాలు అభినంద నీయమని అన్నారు. మనలోని వ్యక్తిగత స్వార్ధాన్ని వదిలి సమాజం గురించి ఆలోచిస్తూ సేవా కార్యక్రమాల్లో పాలుపంచుకున్నపుడే భవ్యమైన భారత దేశ నిర్మాణం జరుగుతుందన్నారు. కష్టాలలో ఉన్న వారిని చూసినపుడు హృదయం ద్రవించాలని అప్పుడే సేవ చేయాలనే సంకల్పం నిర్మాణమవుతుందన్నారు. సృజనాత్మకమైన మార్పు సమాజంలో తీసుకురావాలంటే సేవ చేయాలనే తపన ప్రతి వ్యక్తిలో వెల్లువెత్తాలన్నారు. భారతీయ పరంపరలో వ్యక్తి నాలుగు ధర్మాలు తప్పక నిర్వహించాలని ఆయన అన్నారు. వ్యక్తి ధర్మం, వృత్తి ధర్మం, సామూహిక ధర్మరం, సామాజిక ధర్మం మనం నిష్క్రమించేలోగా నిర్వర్తించాలన్నారు. మనిషి సంపూర్ణ జీవితం గడపాలంటే సేవను ఎంచుకోవాలన్నారు. సేవా కార్యక్రమాలు చేసే ఉద్యమకారులు నేటి సమాజానికి అవసరమన్నారు. ఇటీవల సంభవించిన కేరళ వరదలకు పాశ్ఛాత్య దేశాలు ఆర్ధిక సహకారం అందిస్తామంటే, దేశ ప్రజలు నిరాకరించి తామే స్వయంగా సేవాకార్యక్రమాలకు శ్రీకారం చుట్టి కేరళను ఆదుకున్నారని తెలిపారు. అనాద బాల, బాలికలకు ఆకాంక్ష సంస్థ ద్వారా విద్యా బుద్దులు నేర్పుతున్న ముంబాయి మహిళ షహీన్ మిస్ర్తి, సులబ్ కాంప్లెక్స్ నిర్మాణం ద్వారా లక్షలాది మంది సఫాయి కార్మికులలో ఆత్మాభిమానాన్ని ప్రసాదించిన బిందేశ్వర్ పాఠక్‌ల సేవలు మరువలేనివని కొనియాడారు. అదే విధంగా జైపూర్‌లో కృత్రిమ పాదాన్ని రూప కల్పన చేసి దివ్యాంగులకు పునర్జన్మ ప్రసాదించిన పిసి సేఠీ, రాంచంద్ర శర్మ లక్షలాది మందికి నిత్యాన్నదానం చేసిన డొక్కా సీతమ్మ, వేలాది సేవా కార్యక్రమాలు నిర్వహిస్తోన్న సేవాభారతి లాంటి సంస్ధలు, వ్యక్తులు సేవ చేసే వారికి ఆదర్శనీయులన్నారు. సేవకు ప్రతి రూపంగా అనిది కాలం నుండి హనుమంతున్ని కీర్తిస్తున్నామని తెలిపారు. స్వాతంత్య్ర సమరయోధుడు వినాయక దామోదర్ సావర్కర్ జన్మించినపుడు దేహాన్ని సంతరించుకుంటామని, మరణించాక దేవుడి వద్దకు వెళ్తామని చెప్పారని, దేహం-దేవుడి మధ్య దేశం ఉందన్న విషయం, ఆ దేశానికి సేవ చేయాలన్న సంకల్పం మనుషులలో ఉండాలని సూచించే వారన్నారు. ఆర్‌ఎస్సెస్ దక్షణ మధ్య క్షేత్ర సేవా ప్రముఖ్ ఎక్కా చంద్రశేఖర్ మాట్లాడుతూ సేవా భారతి దేశవ్యాప్తంగా లక్షా డెబ్బది ఐదువేల కార్యక్రమాలను నిర్వహిస్తున్నదని చెప్పారు. ప్రభుత్వం నుండి ఒక్క రూపాయి కూడా తీసుకొకుండా సమాజ సహకారంతోనే సేవా కార్యక్రమాలను నిర్వహిస్తుందని తెలిపారు. తెలంగాణ వ్యాప్తంగా 18 వసతి గృహాలను నిర్వహిస్తూ విద్యార్ధులలో జాతీయవాదాన్ని, సేవాభావాన్ని నింపుతుందన్నారు. సేవా భారతి-వరంగల్ అధ్యక్షులు కాటం రాంకుమార్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సెమినార్‌లో గౌరవ అతిధిలుగా ఐఎంఎం తెలంగాణ అధ్యక్షులు నరసింగారెడ్డి, కొలకతా డ్రగ్స్ ఉప నియాంత్రణ అధికారి రాంకిషన్. తాళ్ల పద్మావతి విద్యా సంస్ధల చైర్మన్ తాల్ల మల్లేశం, ఆర్‌ఎస్సెస్ దక్షణ క్షేత్ర సేవా ప్రముఖ్ ఎక్కా చంద్రశేఖర్, సేవా భారతి తెలంగాణ ఉపాధ్యక్షులు భరత్ అమోల్‌లు పాల్గొన్నారు.

చిత్రాలు..వరంగల్ నగరంలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ఆడిటోరియంలో ఆదివారం సేవా భారతి ఆధ్వర్యంలో జాతి నిర్మాణంలో సేవ-మన పాత్ర అనే అంశంపై జరిగిన సెమినార్‌లో మాట్లాడుతున్న
*సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ, కార్యక్రమానికి హాజరైన మేధావులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు