జాతీయ వార్తలు

రాజీవ్ హంతకులకు క్షమాభిక్ష పెట్టండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెన్నై: దివంగత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య కేసులో జీవిత ఖైదును అనుభవిస్తున్న ఏడుగురు ఖైదీలకు క్షమాభిక్ష ప్రసాదించాల్సిందిగా సిఫార్సు చేస్తూ తమిళనాడు రాష్టమ్రంత్రివర్గం సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు మంత్రివర్గం తీర్మానం చేసి గవర్నర్ ఆమోదానికి పంపింది. ఈ తీర్మానం రాజ్‌భవన్‌కు చేరింది. గవర్నర్ భన్వర్‌లాల్ పురోహిత్ మంత్రివర్గం చేసిన తీర్మానంపై తీసుకోబోయే నిర్ణయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ప్రస్తుతం తమిళనాడు జైల్లో రాజీవ్ గాంధీ హత్య కేసులో హంతకులు మురుగన్, సంతన్, పెరారివాలన్, జయకుమార్, రవిచంద్రన్, రాబర్ట్ పేయాస్, నళిని జీవిత ఖైదును అనుభవిస్తున్నారు. 1991 మే 21వ తేదీన రాజీవ్ గాంధీ హత్య
జరిగింది. 27 సంవత్సరాలుగా వీరు జైల్లో ఉన్నారు. ప్రపంచం మొత్తం మీద ఎక్కువ కాలం అంటే దాదాపు 27 ఏళ్లపాటు జైల్లోనే నళిని ఉన్నారు. ఆదివారం ఇక్కడ ముఖ్యమంత్రి కె పళనిస్వామి అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశం జరిగింది. ఈ మంత్రివర్గంలో తీసుకున్న నిర్ణయాన్ని మంత్రి డి జయకుమార్ విలేఖర్లకు వెల్లడించారు. సుప్రీంకోర్టు ఇటీవల జీవిత ఖైదీ పెరారివాలన్ విషయంలో క్షమాభిక్ష ప్రసాదించే విషయాన్ని పరిశీలించవచ్చని సూచించింది. భారత రాజ్యాంగంలో 161వ అధికరణ కింద గవర్నర్‌కు క్షమాభిక్ష ప్రసాదించే అధికారం ఉంటుంది. కాగా సుప్రీంకోర్టులో వీరిని విడుదల చేయాలన్న పిటిషన్లను ఎప్పటిలాగానే కేంద్రం వ్యతిరేకించింది. సుప్రీంకోర్టు జీవిత ఖైదీ పెరారివాలన్ విషయంలోనే క్షమాభిక్ష ప్రసాదించే విషయమై పరిశీలించాలని కోరితే , తమిళనాడు ప్రభుత్వం ఆశ్చర్యకరమైన రీతిలో మిగిలిన ఆరుగురి పేర్లను కూడావిడుదలకు సిఫార్సు చేసింది.