రాష్ట్రీయం

తలమానికంగా అమరావతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, సెప్టెంబర్ 9: ప్రజా రాజధాని అమరావతిని ప్రపంచంలోనే ఐదు అత్యుత్తమ ప్రపంచ శ్రేణి జీవనయోగ్య నగరాల్లో ఒకటిగా నిలపడమే ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పునరుద్ఘాటించారు. ఇందుకోసం ‘ది ఎనర్జీ అండ్ రిసోర్స్ ఇన్‌స్టిట్యూట్’ (టీఈఆర్‌ఐ) లాంటి అంతర్జాతీయ సంస్థలతో కలిసి పనిచేయాలని రాష్ట్ర రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ (సీఆర్డీఏ) అధికారులను ఆదేశించారు. రాజధాని అమరావతిలో సుస్థిర పట్టణ ప్రణాళిక, వౌలిక సదుపాయాల అభివృద్ధికి అవసరమైన అత్యాధునిక సాంకేతికతను అమలు చేయడానికి కావాల్సిన విధానాలను రూపొందించాలని ఆదివారం ఉదయం టెలీకాన్ఫరెన్స్‌లో ఆయన అధికారులకు సూచించారు. అమరావతి ప్రపంచంలోనే అత్యంత సుస్థిరమైన రాజధాని అవుతుందని టీఈఆర్‌ఐ డీజీ అజయ్ మాథుర్ చేసిన వ్యాఖ్యలను స్వాగతిస్తున్నట్లు తెలిపారు. దక్షిణాది రాష్ట్రాల్లో జీవనయోగ్య నగరాలను రూపొందించడానికి ఉద్దేశించిన ప్రాంతీయ విధాన చర్చలను తొలిసారి అమరావతిలో నిర్వహించాలని టీఈఆర్‌ఐ నిర్ణయించింది.
భారత్‌లోని డెన్మార్క్ ఎంబసీ, నెట్‌వర్క్ ఆఫ్ ద ఇంటర్నేషనల్ అర్బన్ కోఆపరేషన్ గ్లోబల్ కాంపార్ట్ ఆఫ్ మేయర్స్, దక్షిణాసియా ఆధ్వర్యంలో ఈ నెల 19న విజయవాడలో ‘ప్రాంతీయ విధాన చర్చల’ను నిర్వహిస్తున్నారు. ఈ సదస్సులో తమిళనాడు, తెలంగాణ, కేరళ, కర్నాటక, ఒడిశా, పుదుచ్చేరి, చత్తీస్‌గఢ్ రాష్ట్రాలతో పాటు అంతర్జాతీయ నిపుణులు పాల్గొననున్నారు. సదస్సులో ప్రారంభోపన్యాసం చేయాల్సిందిగా టీఈఆర్‌ఐ డీజీ అజయ్ మాథుర్ ముఖ్యమంత్రి చంద్రబాబును ఆహ్వానించినట్లు సీఎం ప్రత్యేక కార్యదర్శి సతీష్‌చంద్ర తెలిపారు. మన దేశంలో అత్యంత నివాసయోగ్య నగరాలను తీర్చిదిద్దేందుకు అవసరమైన విధానాల రూపకల్పన, అమలుకు సంబంధించిన ప్రణాళికను తయారుచేయడమే లక్ష్యంగా ఈ సదస్సు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. దక్షిణాది రాష్ట్రాల్లోని నగరాల మేయర్లు అందరూ అమరావతి సదస్సుకు హాజరవుతుండడంతో ఉత్తమ విధానాలపై చర్చించుకోవడంతో పాటు ఉమ్మడి మార్గాలను అనే్వషించేందుకు ఇది చక్కటి వేదిక అవుతుందని తెలిపారు. రాజధాని నగరానికి చేపట్టిన భూ సమీకరణ విధానంపై ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన హార్వర్డ్ యూనివర్శిటీ అధ్యయనం చేస్తోందని ఆయన తెలిపారు.
అంతర్జాతీయ నిపుణుల సలహాలు, సూచనలు స్వీకరించాలని సీఆర్డీఏ కమిషనర్ సీహెచ్ శ్రీ్ధర్‌కు ముఖ్యమంత్రి సూచించారు. కార్యక్రమంలో పురపాలక శాఖ మంత్రి పీ నారాయణ, సీఎస్ దినేశ్‌కుమార్, సతీష్‌చంద్ర, ప్రిన్సిపల్ సెక్రటరీ జీ సాయిప్రసాద్, ఏడీసీ చైర్‌పర్సన్ లక్ష్మీపార్థసారథి, సీఆర్డీఏ స్పెషల్ కమిషనర్ రామమోహన్ రావు, అదనపు కమిషనర్ షణ్మోహన్, ఈడీబీ సీఈవో జే కృష్ణకిషోర్ పాల్గొన్నారు.