జాతీయ వార్తలు

మమ్మల్ని ఎదుర్కొనే సత్తా ఎవరికీ లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 9: బీజేపీని ఎదుర్కొనే సత్తా ఉన్న పార్టీయే కనిపించటం లేదు.. మహాకూటమికి నాయకత్వం లేదు.. విధానం అస్పష్టం.. అంటూ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రతిపక్షంపై ఎదురు దాడి చేశారు. బీజేపీవద్ద పటిష్టమైన నాయకత్వం, విధానాలు, దేశాన్ని అభివృద్ధి చేయాలనే నిజాయితీ ఉన్నాయి. అందుకే 2019 లోక్‌సభ ఎన్నికల్లో మరోసారి విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని నరేంద్ర మోదీ ప్రకటించారు. ఆదివారం బీజేపీ జాతీయ కార్యవర్గం సమావేశంలో ముగింపు ఉపన్యాసం ఇస్తూ అజేయ భారత్, అటల్ బీజేపీ అనే పిలుపిచ్చారు. బీజేపీని ఎదుర్కొనేవారే కనిపించటం లేదంటూ నరేంద్ర మోదీ ప్రతిపక్షాలను ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ నాయకత్వాన్ని ఒప్పుకునేందుకు ఎవ్వరూ సిద్ధంగా లేరు.. అధికారంలో ఉన్నప్పుడు విఫలమైన కాంగ్రెస్ ఇప్పుడు ప్రతిపక్షంలో కూడా విఫలమవుతోందంటూ నరేంద్ర మోదీ కాంగ్రెస్‌పై విమర్శలు గుప్పించారు. ఆదివారం రాష్ట్ర కార్యవర్గం సమావేశంలో మోదీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా ప్రసంగాల గురించి రవిశంకర్ ప్రసాద్ మీడియాకు వివరించారు. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ నాయకత్వంలో పని చేసేందుకు ప్రతిపక్షాలు సిద్ధంగాలేవు.. వాస్తవానకి కాంగ్రెస్‌లోని సీనియర్ నాయకులే రాహుల్ గాంధీ నాయకత్వాన్ని అంగీకరిచటం లేదని మోదీ ఎద్దేవా చేశారు. ప్రతిపక్షం అర్థపర్థం లేని ఆరోపణలతో
ప్రజల దృష్టిని మళ్లించేందుకు ప్రయత్నిస్తోంది తప్ప తన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించటం లేదని ఆయన విమర్శించారు. తమ ప్రభుత్వం తప్పులను ఎత్తిచూపిస్తే చర్చించేందుకు సిద్ధంగా ఉన్నా.. లోపాలు, లొసుగుల గురించి మాతో పోరాడాలి కానీ ఇలా నిరాధార ఆరోపణలు చేయటం ప్రతిపక్షానికి ఎంత మాత్రం మంచిది కాదని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. 48 సంవత్సరాల కుటుంబ పాలన, 48 నెలల బీజేపీ ప్రభుత్వంపై చర్చ జరిపేందుకు తాను సిద్ధంగా ఉన్నానని నరేంద్ర మోదీ సవాల్ విసిరారు. మీరు 48 సంవత్సరాలు ఎవరు కోసం.. ఎందుకు.. ఏ ఆలోచనతో పని చేశారని తాము ప్రశ్నిస్తామని ఆయన హెచ్చరించారు. 48 సంవత్సరాల కుటుంబ పాలన 48 నెలల తమ పాలనపై చర్చ జరగాలని మోదీ చెప్పారు. ఆ కుటుంబం ఎవరికోసం పని చేసిందనేది వెలుగులోకి రావాలని ప్రధాన మంత్రి చెప్పారు. కాంగ్రెస్ తమ ప్రభుత్వం పని గురించి ప్రశ్నించటం లేదు.. రోజుకో అబద్ధం చెబుతూ తమతో పోరాడుతోంది.. ఇది ఎంతవరకు సమంజసమని నరేంద్ర మోదీ ప్రశ్నించారు. అబద్ధం చెప్పటం, అబద్ధాలను పదే పదే చెప్పటం కాంగ్రెస్‌కు ఒక అలవాటుగా మారిందని ప్రధాని ఆరోపించారు. తమకు విధానాల గురించి పోరాడడం తెలుసు కానీ అబద్ధాలపై పోరాటం చేయటం రాదని మోదీ చెప్పారు. ఇప్పుడు ఎన్నికలకోసం కాంగ్రెస్ అబద్ధాలకు సమర్థవంతమైన పనితో బదులివ్వాలని నరేంద్ర మోదీ పార్టీకి పిలుపిచ్చారు. ప్రతిపక్షాలు ముఖ్యంగా కాంగ్రెస్ చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని గట్టిగా తప్పికొట్టాలని మోదీ పార్టీ కార్యకర్తలకు సూచించారు. కాంగ్రెస్ ‘గరీభీ హటావో’ పేరుతో బ్యాంకులు, బొగ్గు గనులను జాతీయకరణం చేసి ఆ తరువాత తప్పు జరిగిందంటూ తప్పించుకున్నారు కానీ పేదరికాన్ని మాత్రం తొలగించలేకపోయారని మోదీ విమర్శించారు. తమకు అధికార అహంకారం లేదు.. ప్రజల అభివృద్ధికోసం పని చేసేందుకు అవకాశం కల్పించే ఆయుధమన్నారు. గుజరాత్‌తో బీజేపీ 31 సంవత్సరాల నుండి అధికారంలో ఉన్నది.. తమను ఇంతవరకూ ఎవ్వరూ ఓడించలేకపోయారు. జాతిపిత మహాత్మా గాంధీ, ఉక్కు మనిషి సర్దార్ పటేల్ ఈ రాష్ట్రం వారని మోదీ తెలిపారు. గుజరాత్ ఒకప్పుడు కాంగ్రెస్‌కు కంచుకోట లాంటిది అయితే ప్రజలను విస్మరించటం వల్లే ఆ పార్టీ నామరూపాలు లేకుండా పోయిందన్నారు. తాము విలువలకోసం చిత్తశుద్ధితో పనిచేస్తాం.. తమకు నీతి ఉన్నది, వ్యూహాలు ఉన్నాయని మోదీ తెలిపారు. బీజేపీ సిద్ధాంతాలు స్థిరంగా ఉంటాయి.. వ్యూహాలు మాత్రం సమయానుసారం అవసరం మేరకు మారుతుంటాయని ప్రధాన మంత్రి చెప్పారు. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం ఎంతో అవసరం. వారి ప్రశ్నలు, ప్రభుత్వం నుండి జవాబుదారీకోసం ప్రతిపక్షం ప్రయత్నించటం ప్రజాస్వామ్యానికి ఎంతో అవసరం. దీనివలన ప్రజాస్వామ్యం మరింత బలపడుతుందని ప్రధాన మంత్రి అభిప్రాయపడ్డారు.
కాంగ్రెస్ తదితర ప్రతిపక్షాలు మహాకూటమిని ఏర్పాటు చేసేందుకు కొనసాగిస్తున్న కృషిని దుయ్యబట్టారు. ఒకరంటే ఒకరికి పడనివారంతా ఇప్పుడు కౌగిలించుకునేందుకు సిద్ధమవుతున్నారు. బీజేపీ మూలంగానే వారికీ పరిస్థితి వచ్చిందని నరేంద్ర మోదీ ఎద్దేవా చేశారు. ప్రజలకు తమ పట్ల విశ్వాసం పెరిగింది. అందుకే ప్రతిపక్షాలు భయపడుతున్నారని ఆయన చెప్పారు. ప్రతిపక్షానికి ఎలాంటి సిద్ధాంతాలు, రాజకీయ నిజాయితీ లేదన్నారు. కాంగ్రెస్ నాయకత్వంలో పని చేసేందుకు చిన్న, చిన్న పార్టీలు కూడా అంగీకరించటం లేదు. కొన్ని పార్టీలు కాంగ్రెస్‌ను భారంగా భావిస్తున్నాయన్నారు.