రాష్ట్రీయం

మహాకూటమి ముందడుగు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 9: ముందస్తు ఎన్నికలను సమర్థంగా ఎదుర్కోవడానికి జరుగుతున్న కసరత్తులో విపక్షాలు ముందడుగు వేశాయి. టీఆర్‌ఎస్‌ను గద్దె దింపాలన్న ఏకైక లక్ష్యంతో పార్టీల సిద్ధాంతాలను పక్కన పెట్టి ‘మహాకూటమి’ ఏర్పాటుకు సంసిద్ధమయ్యాయి. ఇందుకు తెలుగు దేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచనతో ఆ పార్టీ తెలంగాణ శాఖ అధ్యక్షుడు ఎల్. రమణ చొరవ తీసుకున్నారు. ఆదివారం సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట రెడ్డితో ఆయన జరిపిన తొలి దఫాజ చర్చలు ఫలప్రదమయ్యాయి. సోమవారం ఉదయం తెలంగాణ జన సమితి (టీజేఎస్) అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరామ్‌తో, సాయంత్రం పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డితో రమణ చర్చలు జరపనున్నారు. ఇతర పార్టీలతోనూ సంప్రదింపులు జరిపి, పొత్తులు పెట్టుకోవడానికి వీలుగా రమణ నేతృత్వంలో ఏడుగురు సభ్యులతో పొత్తుల కమిటీని చంద్రబాబు నాయుడు ఏర్పాటు చేశారు. అదేవిధంగా మాజీ హోం మంత్రి టీ. దేవేందర్ గౌడ్ నేతృత్వంలో ఎన్నికల ప్రణాళిక కమిటీని, గరికపాటి సారథ్యంలో ఎన్నికల ప్రచార కమిటీని ఆయన నియమించారు.
ఇలావుంటే, టీడీపీ పొత్తుల కమిటీ నేతలు రమణ, రావుల చంద్రశేఖర్ రెడ్డి, పెద్దిరెడ్డి ప్రభృతులు సీపీఐ నేతలు చాడ వెంకటరెడ్డి, పల్లా వెంకటరెడ్డి తదితరులతో చర్చించి, పొత్తుల విషయంపై ఒక అంగీకారానికి వచ్చారు. ఇది తొలి సమావేశం కాబట్టి, పొత్తుకు వీలుగా సయోధ్య కుదుర్చుకోవాలని వారు భావించారు. ఆ తర్వాత కాంగ్రెస్, టీజేఎస్ తదితర పార్టీలతో చర్చలు జరిపి, మహాకూటమి ఏర్పాటైన తర్వాతే ఏయే అసెంబ్లీ స్థానాల్లో ఏయే పార్టీ పోటీ చేయాలన్న అంశంపై కూలంకషంగా చర్చించి అంగీకారానికి రావచ్చని వారు నిర్ణయించారు. అనంతరం రమణ మీడియాతో మాట్లాడుతూ ఈ ఎన్నికల్లో మహాకూటమి విజయం సాధిస్తుందన్న ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికల్లో మహాకూటమి జెండా ఎగుర వేస్తామని అన్నారు. ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు రాజకీయ, నైతిక విలువలు లేవని విమర్శించారు. మహాకూటమి ఏర్పాటుకు విపక్షాలు సుముఖంగా ఉన్నాయని తెలిపారు. సోమవారం ప్రొఫెసర్ కోదండరామ్, ఉత్తమ్ కుమార్ రెడ్డితో చర్చించనున్నట్లు చెప్పారు. సీపీఐ నేత చాడ వెంకటరెడ్డి మాట్లాడుతూ ప్రతిపక్షాల ఓట్లు చీలిపోకుండా ఉండేందుకు, ఐక్య పోరాటం చేసేందుకు వీలుగా కూటమి ఏర్పాటు జరుగుతుందన్నారు. గెలిచే స్థానాలనే తాము అడుగుతామని ఆయన తెలిపారు. కేసీఆర్ రైతు సమస్యలను పట్టించుకోవడం లేదని ఆయన విమర్శించారు.
ఆ రెండు పార్టీలు జత కట్టేనా?
మహాకూటమి వైపు సీపీఎం, సీని నటుడు పవన్ కల్యాణ్ నేతృత్వంలోని జన సేన పార్టీలు అంతగా ఆసక్తి కనబరచడం లేదు. ఆ రెండు పార్టీలూ కలిసి పోటీ చేసే సూచనలు కనిపిస్తున్నాయి. ముందస్తు ఎన్నికల నేపథ్యంలో పవన్ కల్యాణ్ ఆదివారం పార్టీ ముఖ్యులతో సమావేశమై మంతనాలు జరిపారు. తెలంగాణలో అన్ని స్థానాల్లో పోటీ చేస్తామని ఆయన ఇదివరకే ప్రకటించినప్పటికీ, పార్టీ గట్టిగా నిలబడే స్థానాల లెక్కలు తీస్తున్నారు. రాష్ట్ర రాజకీయ పరిస్థితులను ఎప్పటికప్పుడు గమనిస్తూ నిర్ణయం తీసుకోవాలని పవన్ కల్యాణ్ భావిస్తున్నారు.
చిత్రం..తెలంగాణ జన సమితి ఆదివారం హైదరాబాద్‌లో నిర్వహించిన కార్యక్రమంలో
డప్పు కొడుతున్న ప్రొఫెసర్ కోదండరామ్