రాష్ట్రీయం

రాష్ట్రానికి సీఈసీ బృందం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: తెలంగాణ శాసనసభకు ఎన్నికల ప్రక్రియ అత్యంత మెరుపువేగంతో సాగుతోంది. సెప్టెంబర్ 6న శాసనసభ రద్దుకాగానే, రాష్ట్ర రాజధానితో పాటు దేశ రాజధానిలో కూడా హల్‌చల్ మొదలైంది. ఒకవైపు రాజకీయ పార్టీలు తమ వ్యూహాలు రూపొందించుకుంటూ ఉండగా, మరోవైపు అధికారికంగా ఎన్నికల నిర్వహణకు సంబంధించిన ప్రక్రియ వేగంగా కొనసాగుతోంది. రాష్ట్రంలో తాజాగా ఏర్పడి ఉన్న పరిస్థితిపై కేంద్ర ఎన్నికల కమిషన్ (సీఈసీ)కి వివరించేందుకు రాష్ట్ర చీఫ్ ఎలక్టోరల్ అధికారి రజత్ కుమార్ సోమవారం ఢిల్లీ వెళుతున్నారు. అక్కడ వివరాలు సమర్పించిన తర్వాత రాత్రికి తిరిగి హైదరాబాద్ చేరుకుంటారు. కాగా, సీఈసీ ఆదేశాల మేరకు ఢిల్లీ నుండి ఉన్నతస్థాయి అధికారుల బృందం మంగళవారం హైదరాబాద్ వస్తోంది. ఈ బృందంలో ఎవరెవరు ఉంటారో సోమవారం వెల్లడవుతుంది. 11న హైదరాద్ చేరుకొని, అదే రోజు సాయంత్రం 6.30 గంటలకు గుర్తింపు కలిగిన ఎనిమిది రాజకీయ పార్టీలతో ఈ బృందం సమావేశమవుతుంది. 12న ఉదయం 10 గంటలకు కలెక్టర్లు, ఎస్‌పీలతో సమావేశమవుతుంది. రాష్ట్ర స్థాయి అధికారులు కూడా ఈ సమావేశంలో పాల్గొంటారు. అదే రోజు సాయంత్రం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్‌లతో ప్రత్యేకంగా సీఈసీ బృందం సభ్యులు సమావేశామవుతారు. ఆ తర్వాత ఢిల్లీ వెళ్లి ప్రధాన ఎన్నికల కమిషనర్‌కు నివేదిక సమర్పిస్తారు.