రాష్ట్రీయం

నేడు ఓటర్ల ముసాయిదా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: తెలంగాణ ప్రజలు ఉత్కంఠతో ఎదురు చూస్తున్న శాసనసభ ఎన్నికలకు సంబందించి ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ సోమవారం ప్రారంభమవుతోంది. తెలంగాణ రాష్ట్ర తొలిశాసనసభ ఈ నెల 6న రద్దు కావడంతో ఎన్నికలు జరపాల్సి వస్తోంది. 2018 నవంబర్ లేదా డిసెంబర్‌లో ఎన్నికలు నిర్వహించేందుకు వీలుగా తెలంగాణ చీఫ్ ఎలక్టోరల్ అధికారి (సీఈఓ) రజత్ కుమార్ షెడ్యూల్ ప్రకటించారు. ఓటర్ల జాబితా సవరణ కోసం ముసాయిదా ఓటర్ల జాబితాను సోమవారం వెల్లడిస్తారు. 2018 జనవరి ఒకటవ తేదీ వరకు 18 సంవత్సరాలు నిండిన ప్రతి పౌరుడు ఈ జాబితాలో ఓటరుగా ఉండాలి. 2017 చివరలో ఓటర్ల సవరణ కార్యక్రమం జరిగింది. జాబితాలో పేరు లేని వయోజనులంతా తమ పేర్లను నమోదు చేసుకునేందుకు అప్పట్లో అవకాశం ఇచ్చారు. మరణించిన వారితో పాటు, ఇల్లు మారడం తదితర కారణాల వల్ల ఓటర్ల జాబితాలో కొన్ని పేర్లను తొలగించాల్సి వచ్చింది. 2018 జనవరి 1వ తేదీ వరకు అర్హులైన ఓటర్ల జాబితా ఇప్పటికే ప్రచురించారు. ఈ మధ్య కాలంలో ఎవరైనా తమ పేర్లను నమోదు చేయించుకుని ఉంటే, వారి పేర్లతో ముసాయిదా ఓటర్ల జాబితాను తాజాగా రూపొందించారు. ఈ జాబితా సోమవారం స్థానిక సంస్థలైన గ్రామ పంచాయితీ, మున్సిపాలిటీ, మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయాలవద్ద ప్రజలకు అందుబాటులో ఉంచుతారు. ఎన్నికల అధికారుల కార్యాలయాల వద్ద కూడా ఈ జాబితా ఉంటుంది. ఎవరైనా అర్హులైన ఓటర్లు తమ పేరు అందులో లేదని గమనిస్తే, నిర్ణీత ఫారంలో వివరాలు నింపి సంబంధిత అధికారికి సమర్పించాల్సి ఉంటుంది. ‘మీ సేవ’లో కూడా ఓటర్లు పేర్లను నమోదు చేసుకోవచ్చు. ఆన్‌లైన్‌లో కూడా ఓటర్లు తమ పేర్లను నమోదు చేసుకునే అవకాశం కల్పించారు. తెలంగాణ చీఫ్ ఎలక్టోరల్ కార్యాలయం వెబ్‌సైట్‌లో ఓటర్ల సవరణకు సంబంధించిన వివరాలు అందుబాటులో ఉన్నాయి.
తెలంగాణ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ (సీఈఓ) తాజాగా చేసిన మీడియా ప్రకటన ప్రకారం సోమవారం సమగ్ర ఓటర్ల జాబితాను వెల్లడిస్తారు. సోమవారం నుండి ఈనెల 25 వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు. 18 సంవత్సరాలు నిండిన వారు తమ పేర్లు ఓటర్ల జాబితాలో లేకపోతే నిర్ణీత ఫారంలో వివరాలు నింపి సంబంధిత ఎన్నికల అధికారికి (తహశీల్దారు) పంపించాల్సి ఉంటుంది. ఒకే వ్యక్తిపేర ఒకటి కన్నా ఎక్కువ చోట్ల ఓటర్ల జాబితాలో ఉంటే వారి వివరాలతో ఫిర్యాదు చేసే అవకాశం సెప్టెంబర్ 25 వరకు కల్పించారు. సెప్టెంబర్ 15, 16 తేదీలలో స్థానిక సంస్థల కార్యాలయాల్లో సమావేశాలు నిర్వహించి ప్రజల్లో అవగాహన కల్పించాలని చీఫ్ ఎలక్టోరల్ అధికారి ఉత్తర్వులు జారీ చేశారు. అక్టోబర్ 4 వరకు దరఖాస్తులను పరిష్కరించాల్సి ఉంటుంది. ఈనెల 7 వరకు డాటాబేస్‌ను అప్‌డేట్ చేస్తారు. అనంతరం ఓటర్ల జాబితా సప్లిమెంట్లను, తుది ఓటర్ల జాబితాను అక్టోబర్ 8న ప్రచురిస్తారు.