రాష్ట్రీయం

దిగులొద్దు బిడ్డా..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తల్లి ప్రేమకు కోటి భావాల దృశ్యమిది. మాటలెన్ని చెప్పినా.. అమ్మను ఎంతగా వర్ణించినా.. వర్ణనాతీతమైన జీవన గీతే అమ్మ అని చెప్పే అద్భుతమిది. అమ్మప్రేమకు కొలమానం లేదు. పేదరికమూ లేదు. అందుకే అమ్మ ఉంటే ఓ ధీమా.. జీవితానికీ భీమా.. నడవలేని కొడుకు.. సత్తువ లేని జీవితం.. రెండూ బాధిస్తున్నా.. పేదరికం వేధిస్తున్నా.. ఈ తల్లి ప్రేమను అధిగమించలేకపోయాయి. నగర వీధుల్లో కార్లు షికార్లు చేస్తున్నా.. వాహనాలూ దూసుకు పోతున్నా.. తోస్తే తప్ప కదలని మూడు చక్రాల రిక్షాకే పరిమితమైన కొడుకును ఇలా..ముందుకు తీసుకెళుతున్న ఈ తల్లికి ప్రతి ఒక్కరూ మోకరిల్లాల్సిందే.. దైన్యంలోనూ కొడుకును ధైర్యంగా ముందుకు నడిపిస్తున్న ఈ అమ్మకు జేజేలు పలకాల్సిందే.

ఫొటో: కె.దుర్గారావు