రాష్ట్రీయం

జ్వరాలపై ఆర్టీజీఎస్‌లో ప్రత్యేక డ్యాష్‌బోర్డు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, సెప్టెంబర్ 9: రాష్ట్రంలో జ్వరాల నియంత్రణకు రియల్ టైమ్ గవర్నెన్స్ స్టేట్ కమాండ్ సెంటర్‌లో (ఆర్టీజీఎస్‌లో) ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. జ్వరాలు, పారిశుద్ధ్య పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించేలా సచివాలయంలోని ఆర్టీజీఎస్ కమాండ్ సెంటర్‌లో ప్రత్యేక డ్యాష్‌బోర్డు ఏర్పాటు చేశారు. జ్వరాలు అధికంగా ఉన్న ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించారు. పరిష్కార వేదిక 1100లో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి జ్వరాలు, పారిశుద్ధ్యంపై వస్తున్న ఫిర్యాదులను పరిష్కరించే పనులను డ్యాష్‌బోర్డు ద్వారా పర్యవేక్షిస్తున్నారు. క్షేత్రస్థాయి వాస్తవ పరిస్థితులను తెలుసుకుని అధికారులను అప్రమత్తం చేస్తున్నారు. ఎప్పటికప్పుడు బులెటిన్లు విడుదల చేస్తున్నారు. ఆర్టీజీఎస్‌కు అందుతున్న ఫిర్యాదులపై చర్యలు తీసుకునేలా చూస్తున్నారు. ప్రతిరోజూ జ్వరాలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల ప్రజలకు ఫోన్లు చేసి, వారి పరిస్థితులను తెలుసుకుని అప్రమత్తం చేస్తున్నారు. గత 20రోజుల్లో జ్వరాలకు సంబంధించి 2564 ఫిర్యాదులు అందగా, వాటిలో 1187 ఫిర్యాదులను పరిష్కరించారు. మరో 1377 ఫిర్యాదులు పరిష్కార దశలో ఉన్నాయి. కాలనీల్లో నిలిచిపోయిన వాననీటిని తోడకపోవటం, కాలువలు సరిగ్గా శుభ్రం చేయకపోవడం, చెత్త తొలగించకపోవడం, బ్లీచింగ్ చల్లకపోవటం వంటి అంశాలపై ఎక్కువగా ఫిర్యాదులు వస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన వివిధ యాప్‌ల ద్వారా ఫొటోలు తీసి, అప్‌లోడ్ చేయాలని అధికారులు కోరుతున్నారు.