జాతీయ వార్తలు

మరో యాభైఏళ్లు మాదే అధికారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 9: వచ్చే ఎన్నికల్లో విజయం సాధిస్తే ఆ తరువాత యాభైఏళ్ల వరకు తమను ఓడించే నాథుడే ఉండడని బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా చెప్పారు. లోక్‌సభ ఎన్నికలకోసం దేశంలోని ఇరవై కోట్ల కుటుంబాల వద్దకు వెళ్లాలని ఆయన పార్టీ నాయకులు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. అమిత్ షా ఆదివారం పార్టీ జాతీయ కార్యవర్గం రెండో రోజు సమావేశంలో మాట్లాడారు. ఒక కుటుంబంలో ముగ్గురు, నలుగురు సభ్యులుంటారు కాబట్టి మనమీ కార్యక్రమం ద్వారా దేశంలోని మొత్తం ప్రజలందరి వద్దకు వెళ్లినట్లు అవుతుందని అమిత్ షా చెప్పారు. బీజేపీకి తొమ్మిది కోట్ల మంది కార్యకర్తలున్నారు.. వీరికి సంబంధించిన అన్ని వివరాలు పార్టీ కంప్యూటర్‌లో నిక్షిప్తమై ఉన్నాయి.. ఈ కార్యకర్తలు ముగ్గురు లేదా నలుగురితో మాట్లాడిన పక్షంలో దాదాపు నలభై కోట్ల మందికి పార్టీ సందేశం ఇచ్చినట్లు అవుతుందని అమిత్ షా అభిప్రాయపడ్డారు. తొమ్మిది కోట్ల మంది మా కార్యకర్తలతోపాటు మరో ఇరవై రెండు కోట్ల మందిని కలుసుకుని ఎన్‌డిఏ ప్రభుత్వం గత నాలుగేళ్లలో సాధించిన ఘనవిజయాలను వివరిస్తాం.. తద్వారా దేశ ప్రజలందరికీ పార్టీ, ప్రభుత్వ సందేశాన్ని పంపిస్తామని అమిత్ షా తెలిపారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో విజయం సాధించేందుకు ఈ పథకాన్ని పటిష్టంగా అమలు చేయాలన్నారు. బీజేపీ 2014లో కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తరువాత ఎప్పుడు కూడా విశ్రాంతి తీసుకోలేదు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఇంతవరకు దాదాపు 300 లోక్‌సభ నియోజకవర్గాల్లో పర్యటించారని అమిత్ షా తెలిపారు. ఎన్నికల పర్యటనలను పక్కనపెడితే మోదీ దాదాపు వంద లోక్‌సభ నియోజకవర్గాలకు వెళ్లి వచ్చారని ఆయన తెలిపారు. నరేంద్ర మోదీ ఎన్నికలు జరిగేలోగా మిగతా నియోజకవర్గాల్లో కూడా పర్యటిస్తారని ఆయన అన్నారు. కాంగ్రెస్ 1947లో అధికారంలోకి వచ్చిన తరువాత దాదాపు యాభై సంవత్సరాల వరకు దానిని ఎవ్వరూ ఓడించలేకపోయారని, వచ్చే సంవత్సరం జరిగే లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ గెలిస్తే ఆ తరువాత యాభై సంవత్సరాల వరకు తమకు ఓటమనేదే ఉండదని ఆయన అభిప్రాయపడ్డారు. దేశ రాజకీయాలు మారుతున్నాయి.. ప్రజలు సమర్థవంతమైన పనిని కోరుకుంటున్నారు అని ఆయన అన్నారు. నరేంద్ర మోదీ గుజరాత్‌లో 2001లో గెలిచారు.. అప్పటినుండి ఇప్పటివరకు ఆయన ఎప్పుడూ కూడా ఓడిపోలేదని, పని చేయటం వల్లే ఆయన ఈ స్థాయికి చేరుకున్నారని అమిత్ షా చెప్పారు.

చిత్రం..జాతీయ కార్యవర్గ సమావేశం అనంతరం కార్యకర్తలకు అభివాదం చేస్తున్న బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా