Others

ఓ పెన్ను

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అదో అయిదు రూపాయల పెన్ను
ఐనా దానికి విలువ కట్టడమేంటి?

ప్రతీదానికి ఓ రేటుండే
ఈ ప్రపంచంలో చెప్పాలనే కాని
అది అమూల్యం అద్భుతం
అనంతం ఆహ్లాదంతో కూడి
అక్షర ఆహార్యం దానిలాగే
అందంగా అమరుతోంది

రాసి చూశా ఒకసారి
ఎంత బాగా పరిగెడుతుందది
రాయాలని లేనివారెవరైనా
ఈ భూమిపై ఉంటే
నాకప్పగించండి వారిని
అందులోని ఇంకైపోయేదాకా
రాయస్తూనే ఉంటుంది
విరామం లేకుండా విసుగు రాకుండా
రాసేవారి భావాలింకిపోకుండా

దాంతో రాస్తున్నంతసేపు
నన్ను నేను మరిచాను
భావాలనూ బాధలనూ
అనుభవాలను ఆశయాలను
హృద్యంగా మలచటంలో
అది పంచకల్యాణిలా
అలుపెరుగక దౌడుతీస్తోంది
ఎక్కడ ఆగిపోతుందోనన్న
నా భయాన్ని చూసి నవ్వింది

కలకాలం మిగిలేది
అక్షరమే కాని తాను కానంది
అలా తానూ అందులో భాగమైనా
ఏమీ కానట్టు వినమ్రంగా పలికింది
అందుకే తాను కలమయంది

- జంధ్యాల రఘుబాబు, 9849753298