అంతర్జాతీయం

మాతృభూమిలో పెట్టుబడులు పెట్టండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చికాగో, సెప్టెంబర్ 9: భారత్ నవ నిర్మాణంలో ప్రవాస భారతీయులు కీలకపాత్ర వహించేందుకు కేంద్రం అన్ని చర్యలు తీసుకుంటుందని బీజేపీ నేత అమన్ సిన్హా చెప్పారు. గత ప్రభుత్వాలతో పోల్చితే, బీజేపీ ప్రభుత్వం ఎన్‌ఆర్‌ఏల సేవలను విస్తృత స్ధాయిలో వినియోగించుకోవాలన్న నిర్ణయంతో ఉందన్నారు. దీని నిమిత్తం ప్రణాళికను కూడా రూపొందించిందన్నారు. భారత్ అభివృద్ధికి ప్రవాస భారతీయులు ముందుకు రావాలన్నారు. ఆయన ఇక్కడ వార్తా ఏజన్సీతో మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా భారత్ వెలుపల మూడు కోట్ల మంది ప్రవాస భారతీయులు ఉన్నారన్నారు. ఎన్‌ఆర్‌ఏల సంక్షేమానికి, అభివృద్ధికి తమ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందన్నారు. ప్రపంచ హిందూ కాంగ్రెస్ సమ్మేళనంలో పాల్గొనడానికి ఆయన ఇక్కడకు వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొత్త చట్టం ప్రకారం త్వరలో ఎన్‌ఆర్‌ఐలు కూడా ఓటును వేసేందుకు వీలు కల్పించనున్నట్లు చెపమ్పారు.చట్టంలో వచ్చిన మార్పులను వినియోగించుకోవాలని ఎన్‌ఆర్‌ఐలను కోరారు. గత 70 ఏళ్లుగా ప్రవాస భారతీయుల సేవలను సరిగా వినియోగించుకోవడంలో పూర్వ ప్రభుత్వాలు విఫలమయ్యాయన్నారు. ఎఐసీసీ అధినేత రాహుల్ గాంధీ అవగాహన లేకుండా మాట్లాడడం విచారకరమన్నారు.
ప్రధాని నరేంద్రమోదీ ఆధ్వర్యంలో అభివృద్ధి వేగవంతమైందన్నారు. జాతీయవాదం తమ అజెండా అన్నారు. దేశంలో అన్ని వర్గాలు, మతాల ప్రజలు సామరస్యంగా ఉన్నారన్నారు. రాహుల్ గాంధీ అవగాహన లేకుండా మాట్లాడడం వల్ల క్రెడిబిలిటీని కోల్పోతున్నారన్నారు.