అంతర్జాతీయం

పాక్ కొత్త అధ్యక్షుడిగా ఆరిఫ్ అల్వీ ప్రమాణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇస్లామాబాద్, సెప్టెంబర్ 9: పాకిస్తాన్ నూతన అధ్యక్షుడుగా ఆరిఫ్ అల్వీ ఆదివారం పదవీ ప్రమాణ స్వీకారం చేశారు. ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌కు అత్యంత సన్నిహితుడు, అధికార తెహ్రీక్-ఏ-ఇన్సాఫ్ పార్టీ వ్యవస్థాపకుల్లో ఒకరైన అరవై తొమ్మిదేళ్ల దంద వైద్యుడు ఆరిఫ్ అల్వీ పాకిస్తాన్‌కు 13వ అధ్యక్షుడు. అజ్వాన్ ఎ సదర్ (రాష్టప్రతి భవన్)లో నిరాడంబరంగా జరిగిన కార్యక్రమంలో చీఫ్ జస్టిస్ సాకిబ్ నిసార్ అల్వీ చేత ప్రమాణ స్వీకారం చేయించారు. కార్యక్రమానికి ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్, ఆర్మీ చీఫ్ జనరల్ ఓమర్ జావేద్ బజ్వాలతోబాటు సైనిక, పౌర విభాగాలకు చెందిన పలువురు ఉన్నతాధికారులు హాజరయ్యారు. చైనా విదేశాంగ శాఖ మంత్రి వాంగ్ ఈ, సౌదీ సమాచార శాఖ మంత్రి అవ్వాద్‌బిన్ సలేహ్ అలీ అవ్వాద్‌లు అతిధులుగా హాజరయ్యారు. దేశాధ్యక్ష పదవి కోసం జరిగిన ముక్కోణపు పోటీలో డాక్టర్ అల్వీ తన సమీప అభ్యర్థులు పాకిస్తాన్ పీపుల్స్‌పార్టీ అభ్యర్థి అయిజాజ్ అహసాన్, ముస్లిం లీగ్ -ఎన్ నామినీ వౌలానా ఫజులుర్ రెహమాన్‌లను ఓడించారు. పాకిస్తాన్‌లో ప్రధాని సిఫార్సులతో పనిచేసే అధ్యక్షుడిని ఫెడరల్ విధానానికి చిహ్నంగా, రాజ్యాంగ అధినేతగా భావిస్తారు. కాగా కరాచీకి చెందిన అల్వీ ఉమ్మడి భారత దేశ విభజన సందర్భంగా మన దేశంలోని ఆగ్రా నుంచి పాకిస్తాన్‌కు వలసవెళ్లిన కుటుంబానికి చెందిన వారు. ఆయన తండ్రి దంత వైద్యుడైన డాక్టర్ హబీబ్ ఉర్ రహమాన్ ఇలాసి అల్వీ మన దేశ తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూకు వైద్యం చేసేవారని అధికార పార్టీ వర్గాల కథనం మేరకు తెలుస్తోంది.