క్రీడాభూమి

ఒసాకా సంచలనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూయార్క్, సెప్టెంబర్ 9: జపాన్ టెన్నీస్ క్రీడాకారిణి నవోమి ఓసాకా సంచలనం సృష్టించింది. ఆరితేరిన ఆటగత్తె సెరీనాపై 6-2, 6-4సెట్లతో సునాయాస విజయం సాధించి యూఎస్ ఓపెన్ టైటిల్ సాధించింది. గ్రాండ్‌శ్లామ్ సాధించిన తొలి జపాన్ క్రీడాకారిణిగానూ రికార్డు నిలుపుకుంది. ఇక బిడ్డకు జన్మనిచ్చిన తరువాతా మహోగ్ర ఆట తీరు ప్రదర్శించి ఫైనల్స్‌కు చేరిన సెరీనా మాత్రం, ఫైనల్స్‌లో ఫ్రస్ట్రేషన్‌కు గురై అపఖ్యాతి మూటగట్టుకుంది. ఆట మధ్యలో కోచ్ సూచనలు తీసుకున్న సెరీనాపై పాయింట్ పెనాల్టీ విధించిన చైర్ అంపైర్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘కోచ్ నుంచి ఎలాంటి సూచనలూ తీసుకోలేదు. గెలుపు కోసం చీటింగ్‌కు పాల్పడే చీప్ వ్యక్తిత్వం కాదు నాది. ఒటమినైనా అంగీకరిస్తాను కానీ, చీటింగ్‌కు పాల్పడను. నువ్వొక దొంగ. అబద్ధాలు చెబుతున్నావ్’ అంటూ అనుచిత వ్యాఖ్యలు చేసింది. చైర్ అంపైర్ తన వ్యక్తిత్వంపై దాడి చేస్తున్నాడంటూ రిఫరీకి ఫిర్యాదు చేసి, క్షమాపణలు చెప్పించాలని పట్టుబట్టడంతో యూఎస్ ఓపెన్ ఫైనల్స్ ఆటకంటే వివాదంతో సంచలనమైంది. ‘నన్ను మరో కోర్టులో ఎప్పటికీ కలుసుకోలేవు. నువ్వొక అబద్ధాలకోరువి’ అంటూ రాకెట్‌ను విసిరికొట్టి సెరెనా భద్రకాళి అవతారమెత్తడంతో కొద్దిసేపు గందరగోళం తలెత్తింది. అప్పటికే 1-0 ఆధిక్యంతోవున్న ఓసాకా, తరువాతి సెట్‌లో 5-3 పాయింట్లతో ఉంది. కన్నీటి పర్యంతమవుతూనే తరువాతి గేమ్‌ను సెరీనా సొంతం చేసకున్నా, చివరి గేమ్‌లో 6-4 స్కోరుతో ఒసాకా మ్యాచ్‌ను ముగించింది. ‘నేను సాధించిన విజయం ఇప్పుడు నాకేమీ అనిపించడం లేదు. ఈ విజయం గొప్పతనం ఏమిటో కొద్దిరోజుల్లోనే నాకు అనుభవంలోకి వస్తుందేమో’ అని మ్యాచ్ అనంతరం ఒసాకా వ్యాఖ్యానించింది. ‘సెకెండ్ సెట్‌లో 5-3తో ఆధిక్యంలో ఉన్నపుడు కొద్దిపాటి అయోమయానికి గురయ్యాను. ఎందుకంటే, నేను ఆడుతున్నది గ్రేట్ చాంపియన్‌తో. నాకు తెలుసు, ఆమె ఏ క్షణంలోనైనా నాపై ఆధిక్యాన్ని సాధించొచ్చు. అయితే, కొద్ది క్షణాలకే అయోమయం విజయమైంది’ అని ఒసాకా వ్యాఖ్యానించింది. ఇక 2017 సెప్టెంబర్ 1న ఒలింపియాకు జన్మనిచ్చిన తరువాత సెరీనాకు ఇది తొలి గ్రాండ్‌శ్లామ్. ఇక్కడ విజయం సాధించివుంటే, 24 గ్రాండ్‌శ్లామ్‌లతో ఆల్‌టైం రికార్డుగావున్న మార్గరెట్ కోర్టు రికార్డును సమం చేసి ఉండేది. వ్యక్తిత్వాన్ని కించపరుస్తున్నావంటూ చైర్ అంపైర్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన విలియమ్స్, ట్రోఫీ సెర్మనీ సమయంలో వినమ్రంగా ప్రవర్తించడం ఆమెకే చెల్లింది. అనౌన్సర్ సహా అభిమానులంతా విలియమ్స్ నామజపం చేస్తుంటే, కన్నీటితోవున్న ఒసాకాను చూపిస్తూ.. ‘ఆమె చక్కగా ఆడింది. ఆమెకు ఇది తొలి గ్రాండ్‌శ్లామ్. అందరం కలిసి ఈ క్షణాలను ఆమె జీవితంలో అద్భుతం చేద్దాం’ అంటూ విజ్ఞప్తి చేయడంతో వాతావరణం పూర్తిగా మారిపోయింది. ఒసాకా ప్రతిస్పందిస్తూ ‘యూఎస్ ఓపెన్ ఫైనల్స్‌లో సెరెనాతో ఆడితే చాలన్నది నా కల’ అని చెప్పుకొచ్చింది. విలియమ్స్‌ని చూస్తూ ‘నాకు చాలా గొప్పగా అనిపిస్తుంది. నేను నీతో ఆడగలిగాను. కృతజ్ఞతలు’ అనడంతో ట్రోఫీ సెర్మనీలోని టెన్నిస్ అభిమానులంతో పెద్దపెట్టున హర్షధ్వానాలు చేశారు.