రాష్ట్రీయం

రూ.3.15 కోట్లతో ఆత్మగౌరవ భవనాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నర్సంపేట, సెప్టెంబర్ 9: నర్సంపేట నియోజకవర్గంలో వివిధ కుల సంఘాల ఆత్మగౌరవ భవనాలకు రాష్ట్ర ప్రభుత్వం రూ.3.25కోట్లు మంజూరు చేసిందని రాష్ట్ర సివిల్ సప్లయ్ చైర్మన్ పెద్ది సుదర్శన్‌రెడ్డి వెల్లడించారు. నర్సంపేట పట్టణంలోని ఆర్‌అండ్‌బి అతిథి గృహంలో వివిధ కుల సంఘాల పెద్దలు, పార్టీ నాయకులతో పెద్ది ఆదివారం సమావేశమయ్యారు. ఈసందర్భంగా పెద్ది మాట్లాడుతూ జీఓ నంబర్ 749 ద్వారా నర్సంపేట నియోజకవర్గంలోని పలు కమ్యూనిటీ హాల్స్‌కు నిధులు మం జూరు చేసిందని తెలిపారు. పల్లె ప్రగ తి సందర్భంగా తాను ఇచ్చిన హామీలకు అనుగుణంగా ప్రభుత్వం నిధు లు విడుదల చేసిందన్నారు. గిరిజను ల బంజార భవన్‌కు రూ.50లక్షలు, గొల్ల, కురుమలకు రూ.50లక్షలు, ముదిరాజ్‌లకు రూ.50లక్షలు, గీత కార్మికులకు రూ.50లక్షలు, పద్మశాలిలకు రూ.50లక్షలు, మైనార్టీలకు రూ.50లక్షలు, రజక సంఘం భవనానికి రూ.15 లక్షలు, బెస్తకులస్థులకు రూ.10లక్షలు, మహిళా సమన్వయ సమితికి రూ.10లక్షలు, రిటైర్డు ఎంప్లాయిస్ భవన్‌కు రూ.10లక్షలు, నాయి బ్రాహ్మణులకు రూ.10లక్షలు, పూసల సంఘానికి రూ.10లక్షలు మంజూరు అయ్యాయని తెలిపారు. త్వరలో ఆత్మగౌరవ భవన నిర్మాణాలకు శంకుస్థాపనలు చేయనున్నట్లు వివరించారు. ఈకార్యక్రమంలో టీఆర్‌ఎస్ నియోజకవర్గ నాయకుడు రాయిడి రవీందర్‌రెడ్డి, మునిగాల వెంకట్‌రెడ్డి, మున్సిపల్ చైర్మన్ నాగెల్లి వెంకటనారాయణగౌడ్, మాజీ సర్పంచ్ నల్లా మనోహర్‌రెడ్డి, మాజీ ఎంపీపీ రుద్ర ఓంప్రకాశ్, కౌన్సిలర్లు మండల శ్రీనివాస్, గుంటి కిషన్, నాయిని నర్సయ్య, బండి ప్రవీణ్, పెండెం వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.