రాష్ట్రీయం

యువతను మోసగించిన కేసీఆర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భీమదేవరపల్లి, సెప్టెంబర్ 9: యువత బలాదానాల మీద పీఠమెక్కి నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పిస్తామని.. బంగారు తెలంగాణతో ప్రతి కుటుంబాన్ని ఆదుకుంటామని నాలుగేళ్ల పాటు అధికారంలో ఉన్న కేసీఆర్‌ను ఇక తెలంగాణ ప్రజలు విశ్వసించరని హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే అల్గిరెడ్డి ప్రవీణ్‌రెడ్డి అన్నారు. వరంగల్ అర్బన్ జిల్లా భీమదేవరపల్లి మండలం ముల్కనూర్‌లో ఆదివారం ఎల్కతుర్తి మండలం పెంచికల్‌పేట, కోహెడ మండలం నాగసముద్రాల, భీమదేవరపల్లి మండలం గట్లనర్సింగాపూర్ గ్రామానికి చెందిన వందలాదిమంది ఆదివారం మాజీ ఎమ్మెల్యే ప్రవీణ్‌రెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు. ఈసందర్భంగా ప్రవీణ్‌రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కొరకు ఎందరో నిరుద్యోగులు తమ ప్రాణాలు సైతం ఫణంగా పెట్టి తెలంగాణ సాధిస్తే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత తమకు ఉద్యోగాలు వస్తాయని.. తమ కుటుంబాలు ఆనందోత్సాహాలతో ఉంటాయని భావిస్తే కేవలం పదవిలో ఉన్న సమయంలో 15 వేల ఉద్యోగాలు మాత్రమే ఇచ్చినారని దుయ్యబట్టారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం గెలుస్తామని ధీమా ఉన్నప్పటికీ మండలానికి ఒక్కో ఇన్‌చార్జిని ఎందుకు నియమిస్తున్నదని ప్రశ్నించారు. మెట్టప్రాంతమైన హుస్నాబాద్‌కు సాగునీరు అందించేంత వరకు నిద్రపోనని ప్రగల్బాలు పలికిన సీఎం ఇంతవరకు గౌరవెళ్లి ప్రాజెక్ట్ ఎందుకు పూర్తి చేయలేదో ఈ ప్రాంత ప్రజలకు జవాబు చెప్పిన తర్వాత ఓట్లు అడగాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ పక్షానా తాము ఇంటింటికి వెళ్లి తెలంగాణ రాష్ట్ర సమితి ఇచ్చిన హామీలు ఎంవదుకు నెరవేర్చలేదో ప్రజలకు సమాధానం చెప్పాలని.. తాము చేయబోయే పనులపై ప్రజలను ఓట్లు అడుగుతామన్నారు. ఈసందర్భంగా ఓ బిసి సంఘం రాష్ట్ర అధ్యక్షులు కిషన్‌యాదవ్‌ను కాంగ్రెస్ నేతలు సన్మానించారు. ఈకార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షులు జిమ్మల భీంరెడ్డి, మాజీ ఎంపిపి అశోక్‌ముఖర్జీ, కేతిరి లక్ష్మారెడ్డి, కొడకండ్ల సుదర్శన్‌రెడ్డి, మంగ రాంచంద్రం తదితరులు పాల్గొన్నారు.

చిత్రం..కాంగ్రెస్ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానిస్తున్న మాజీ ఎమ్మెల్యే ప్రవీణ్‌రెడ్డి