తెలంగాణ

భారత్ బంద్‌లో పాల్గొనండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 9: పెట్రోలు, డీజిల్ ధరలు రోజు, రోజుకూ పెరిగి, సామాన్యులపై మోయలేని భారం పడుతున్నందున ఏఐసీసీ ప్రకటించిన భారత్ బంద్‌లో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని పీసీసీ అధ్యక్షుడు ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి కోరారు. ఆదివారం గాంధీ భవన్‌లో సికింద్రాబాద్, హైదరాబాద్, మల్కాజిగిరి, చేవెళ్ళ, మెదక్ పార్లమెంటు నియోజకవర్గాలకు చెందిన అసెంబ్లీ నియోజకవర్గాల పార్టీ సమన్వయకర్తల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ఏఐసీసీ కార్యదర్శి బోసు రాజు కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఉత్తమ్ మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదీ, రాష్ట్ర ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు ధరల నియంత్రణలో పూర్తిగా విఫలమయ్యారని విమర్శించారు. ఎన్నికల ముందు ధరలను అదుపు చేస్తానని ఇచ్చిన హామీనీ నిలబెట్టుకోలేదని దుయ్యబట్టారు. భారత్ బంద్‌లో ప్రతి ఒక్క కార్యకర్తల పాల్గొని విజయవంతం చేయాలని ఆయన కోరారు. ముందస్తు ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
కాంగ్రెస్‌లోకి ఆకుల రాజేందర్
ఇలాఉండగా ఆదివారం ఉత్తమ్‌కుమార్ రెడ్డిని మల్కాజీగిరి మాజీ ఎమ్మెల్యే ఆకుల రాజేందర్ కలిసి పార్టీలో చేరాలనుకుంటున్నట్లు చెప్పారు. అయితే ఈ నెల 12వ తేదీ తర్వాత పార్టీలో చేరాల్సిందిగా ఉత్తమ్ ఆయనకు సూచించారు. మరోవైపు బీసీ ఐక్య వేదిక అధ్యక్షుడు అల్లంపల్లి రాంకోటి తన అనుచరులతో గాంధీ భవన్‌కు వచ్చి ఉత్తమ్ అధ్వర్యంలో కాంగ్రెస్‌లో చేరారు.