తెలంగాణ

ఎండుతున్న పంటలు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంస్థాన్‌నారాయణపురం, సెప్టెంబర్ 9: అనేక రాష్ట్రాల్లో అతివృష్ఠి వల్ల పంటలు కోల్పోతున్న రైతులకు, తెలంగాణలోని పలు ప్రాంతాల్లో అనావృష్ఠి వల్ల కోట్లాది రూపాయల పంటలు రైతన్నలు నష్టపోతున్నారు. మునుగోడు నియోజకవర్గంలోని పలు మండలాలలో వర్షాలు లేని కారణంగా వ్యవసాయ పంటలు పూర్తిగా ఎండిపోతున్నాయి. రాజకీయపార్టీలు ఎన్నికల హడావుడిలో మునిగితేలుతున్నాయి తప్ప రైతులను పట్టించుకునే పరిస్థితిలో లేకుండా పోయాయి. వ్యవసాయ సీజన్‌లో ప్రారంభంలో కురిసిన వర్షాలు గత రెండు నెలలుగా ముఖం చాటేయడంతో పత్తి, వరి, కంది, జొన్న, ఆముదం పంటలు పూర్తిగా ఎండిపోయాయి. వర్షాలు లేక పత్తి పంటలు కాయదశలో ఎండుతుండటంతో పెట్టిన పెట్టుబడులు మట్టిలోనే కలిసిపోతున్నాయి. వేసిన పంటలకు రావాల్సిన లక్షల రూపాయల ఆదాయాన్ని రైతులు కోల్పోయారు. 24గంటల కరెంటు వల్ల భూగర్భజలాలు అడుగంటిపోతుండటంతో బోర్లు ఎండిపోయి వేసిన వరి పంటలూ ఎండిపోతున్నాయి. వ్యవసాయ బావుల వద్ద పశువులకు, జీవాలకు తాగునీరు లేకుండాపోవడంతో రైతులు లబోదిబోమంటున్నారు. గొర్రెల కాపరులు తాగునీరు లేకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. సాగు నీటి ప్రాజెక్టులు లేని ఈప్రాంతంలో రైతులు పూర్తిగా వర్షాదారంపైనే పంటలు పండిస్తున్నారు. సకాలంలో వర్షాలు కురిస్తేనే రైతులు పంటలు పండిస్తారు. లేదంటే అప్పులిచ్చిన వారు రైతుల ఇంటిచుట్టూ తిరిగితే రైతులు ఎండిపోయిన పంటల చుట్టూ తిరుగుతూ దివాళా తీస్తుంటారు. ఈసంవత్సరం రైతులు తీవ్రంగా నష్టాలను చవిచూస్తుండటంతో అప్పులు ఎలా తీర్చాలో తెలియ డం లేదని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

చిత్రం..నీరులేక ఎండుతున్న వరిపంట