తెలంగాణ

తెలుగుభాషా వికాసానికి కృషి చేసిన కాళోజి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వనపర్తి, సెప్టెంబర్ 9: తెలంగాణ కోసం, తెలుగు భాష కోసం కృషి చేసిన మహానీయుడు కాళోజినారాయణరావు అని జిల్లా కలెక్టర్ శే్వతామహంతి అన్నారు. ఆదివారం ప్రజా కవి కాళోజినారాయణరావు జయంతిని పురస్కరించుకొని కలెక్టర్ కార్యాలయంలో కాళోజి చిత్రపటానికి ఆమె పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ కాళోజి నారాయణరావు కవిగా, ఉద్యమకారునిగా, గ్రంథాలయ ఉద్యమంలో, స్వాతంత్య్ర ఉద్యమంలో పాల్గొన్నారని ఆమె అన్నారు. నిజాం ,రజారక్ల పాలనకు వ్యతిరేకంగా పోరాటం చేశారని, ఎమ్మెల్సీగా ఉమ్మడి ఆంద్రప్రదేశ్ రాష్ట్రానికి సేవలు అందించారని , అంతే కాక తెలంగాణ రాష్ట్రం కోసం కృషి చేశారని అన్నారు. అలాంటి మహనీయుని జయంతిని ప్రభుత్వ పరంగా నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. కార్యక్రమంలో జేసి వేణుగోపాల్, ఇన్‌చార్జి డిఆర్వో వెంకటయ్య, ఆర్డీవో చంద్రారెడ్డి , డిపి ఆర్వో వెంకటేశ్వర్లు, జిల్లా గెజిటెడ్ అధికారుల సంఘం అద్యక్షుడు మధుకర్, కార్యదర్శి చందోజిరావు, కలెక్టర్ కార్యాలయం ఏవో వెంకటకృష్ణ, సూపరింటెండెండ్ శ్రీకాంత్‌రావు తదితరులు పాల్గొని కాళోజి నారాయణ చిత్రపటానికి పుష్పగుచ్చాలు సమర్పించి నివాళులర్పించారు.

చిత్రం.. కాళోజీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళలర్పిస్తున్న కలెక్టర్