ఆంధ్రప్రదేశ్‌

ప్రపంచ జూ. సర్క్యూట్‌కు భారత టీటీ జట్లు పయనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (ఎడ్యుకేషన్), సెప్టెంబర్ 9: క్రొయేషియా, సెర్బియాలో జరగనున్న ఓపెన్ సబ్ జూనియర్, జూనియర్ ప్రపంచ టీటీ సర్క్యూట్‌లో పాల్గొనేందుకు భారత టేబుల్ టెన్నిస్ జట్లు ఆదివారం విజయవాడ నుండి పయనమయ్యాయి. ఇక్కడ జరుగుతున్న 11వ స్పోర్ట్స్ నేషనల్ ర్యాంకింగ్ టేబుల్ టెన్నిస్ చాంపియన్‌షిప్ (సౌత్‌జోన్)లో పాల్గొన్న క్రీడాకారులు ఈ రెండు టోర్నమెంట్లకు నగరం నుండి బయలుదేరారు. క్రొయేషియాలో ఈ నెల 12 నుండి 16 వరకు, సెర్బియాలో ఈ నెల 19 నుండి 23 వరకు జరగనున్న ప్రీమియర్ వరల్డ్ జూనియర్ సర్క్యూట్‌లో వీరు పాల్గొననున్నారు. ఎంపికైన జట్టు సభ్యులను టీటీఎఫ్‌ఐ సెక్రటరీ జనరల్ ఎంపీ సింగ్, సీనియర్ ఉపాధ్యక్షుడు ఎస్‌ఎం సుల్తాన్, తదితరులు శుభాకాంక్షలు తెలిపారు. ఎంపికైన జూనియర్ బాలుర విభాగంలో మనుష్ షా, రైగన్ అల్బుకెర్కీ, అంకురామ్ జైన్, దీపిత్ రాజేష్ పాటిల్, ఆకాష్ పల్, మాలిక్, బాలికల విభాగంలో అనుష్క కుతుంబలే, స్వస్తిక ఘోష్, ప్రప్తీ సేన్, బైస్య, రాధాప్రియ గోయల్, దియా చటలే ఉన్నారు. సబ్ జూనియర్ బాలుర విభాగంలో పాయస్ జైన్, విశ్వదీనదయాలన్, ఆదర్శ్ ఓమ్ ఛత్రీ, దివ్యాన్ష్ శ్రీవాస్తవ, బాలికల విభాగంలో మం జునాథ్, లక్షీత నరాంగ్, కరుణ గజేంద్రన్, కావ్యశ్రీ భాస్కర్ ఉన్నారు. ఈ జట్లకు కోచ్‌లుగా మహ్మద్ ఇబ్రహీం ఖాన్, కృనాల్ తెలాంగ్, సుభజీత్ సాహ, జ్యోతిషా వ్యవహరిస్తారు.