ఆంధ్రప్రదేశ్‌

సీపీఎస్ రద్దుకు అధ్యయన కమిటీ ఎందుకు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, సెప్టెంబర్ 9: రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ శాఖల్లో లక్షా 84వేల మంది ఉపాధ్యాయ, ఉద్యోగ, కార్మికులకు శాపంలా మారిన కాంట్రిబ్యూటరీ పెన్షన్ పథకం (సీపీఎస్) రద్దు కోసం రాష్ట్ర ప్రభుత్వం అధ్యయన కమిటీ ఏర్పాటు చేయబోతోందంటూ శాసన మండలిలో పీడీఎఫ్ ఫ్లోర్ లీడర్ గాదె శ్రీనివాసుల నాయుడు ప్రకటన చేయటాన్ని ఏపీ సీపీఎస్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పాలేల రామాంజనేయులు యాదవ్, బాజీ పఠాన్ ఆదివారం ఒక ప్రకటనలో విమర్శించారు. ప్రభుత్వ నిర్ణయాన్ని ఆయన స్వాగతించడం అంటే కాలయాన చేయటం మినహా మరొకటి కాదని పేర్కొన్నారు.
సీపీఎస్ విధానం అమలు సమయంలో అవసరం లేని కమిటీ, రద్దు కోసం ఎందుకని ప్రశ్నించారు. చిత్తశుద్ధితో సీపీఎస్ రద్దు కోరుకుంటుంటే రద్దయ్యేవరకు శాసన మండలిలో ఆమరణ దీక్ష చేయాలని సూచించారు. సీపీఎస్ రద్దు కోసం ఏ రాజకీయ పక్షం, ఏ సంఘం, ఏ వ్యక్తి ఏమి చేస్తున్నారో ఉద్యోగులు సునిశితంగా గమనిస్తున్నారన్నారు. అయితే సీపీఎస్ రద్దు కోసం మండలాల్లో పోరాడుతున్న పీడీఎఫ్ సభ్యులందరినీ తాము అభినందిస్తున్నామన్నారు. సీపీఎస్ రద్దు కోసం అసెంబ్లీ తీర్మానం అవసరం లేదని, 653, 654, 655 జీవోలను రద్దుచేసి 1980 పెన్షన్ రూల్‌ను పునరుద్ధరిస్తూ ఓ కొత్త జీవో విడుదల చేస్తే సరిపోతుందన్నారు. ఎమ్మెల్సీలు రాజీనామా చేసి ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని వారు కోరారు.