ఆంధ్రప్రదేశ్‌

‘యువనేస్తం’ విధివిధానాలు ఖరారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, సెప్టెంబర్ 9: ఏ దేశానికైనా, కుటుంబానికైనా యువతే వెనె్నముక. విద్యావంతులైన యువతరానికి ఉపాధి అవకాశాలు అందించగలిగితే సమాజ భవిష్యత్ ఉజ్వలంగా ఉంటుంది. ఇదే విషయాన్ని నమ్మి దూరదృష్టితో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిరుద్యోగులను ఉద్యోగార్దులుగా మార్చేందుకు ‘ముఖ్యమంత్రి యువనేస్తం’ పథకాన్ని రూపొందించారు. ఈ పథకం ద్వారా అర్హులైన నిరుద్యోగ యువతీ యువకులందరికీ నెలనెలా వెయ్యి రూపాయలు నిరుద్యోగ భృతి పొందే అవకాశం లభించనుంది. దీనికి సంబంధించిన విధివిధానాలు దాదాపు ఖరారయ్యాయి. ఇక అమలు కోసం లక్షలాది మంది నిరుద్యోగులు ఎదురుతెన్నులు చూస్తున్నారు. మరో విశేషం ఏమిటంటే ఇప్పటివరకు కొన్ని రాష్ట్రాలు గరిష్టంగా 20వేల మందికి మాత్రమే భృతి ఇవ్వటానికి ప్రయత్నించి విఫలమైతే చంద్రబాబు మాత్రం ఈ రాష్ట్రంలో ఎంతమంది అర్హులున్నా వారందరికీ భృతి ఇస్తామంటున్నారు. ఇందులో ముఖ్యాంశాలు ఉచిత నైపుణ్యాభివృద్ధి శిక్షణ, స్వయం ఉపాధి శిక్షణ, స్వయం ఉపాధి కల్పన, అప్రెంటీస్ కార్యక్రమం, కేంద్ర ప్రభుత్వ అప్రెంటీస్ కార్యక్రమం అనుసంధానం ద్వారా అన్ జాబ్ ట్రైనింగ్, కాంపిటేటివ్ పరీక్షల కోసం శిక్షణ ఇవ్వటం వంటివి ఉన్నాయి.
భృతికి అర్హులు వీరే..
నిరుద్యోగ భృతి పొందటానికి అర్హులైన వారి వయస్సు 22 నుండి 35 సంవత్సరాల మధ్య ఉండాలి. పీజీ, గ్రాడ్యుయేషన్ లేదా డిప్లొమా పూర్తిచేసి ఒక సంవత్సరం గడిచి ఉండాలి. తెల్ల రేషన్ కార్డు కలిగి ఉండాలి. ప్రజా సాధికార సర్వేలో పేరు నమోదై ఉండాలి. ఆంధ్రప్రదేశ్‌లో నివసిస్తున్న నిరుద్యోగులై ఉండాలి. కుటుంబంలో ఏ ఒక్కరూ ప్రభుత్వ ఉద్యోగి అయి ఉండకూడదు. ఈపీఎఫ్, ఈఎస్‌ఐ కింద నమోదు చేసిన ప్రైవేట్ సంస్థలు, ఔట్‌సోర్సింగ్, కాంట్రాక్టు ప్రాతిపదికన పనిచేస్తున్న యువత అనర్హులు. కుటుంబంలో నాలుగు చక్రాల వాహనం ఉండకూడదు. ప్రభుత్వం నుండి రుణం, సబ్సిడీ రూ. 50వేలు మించి పొంది ఉండకూడదు. గరిష్టంగా 2.5 ఎకరాల మాగాణి భూమి, 5ఎకరాల మెట్ట భూమికి మించి ఉండకూడదు. అనంతపురం జిల్లాకు సంబంధించి గరిష్టంగా 5 ఎకరాల మాగాణి భూమి, 10 ఎకరాల మెట్ట భూమిని మించి ఉండకూడదు. మీ బ్యాంక్ ఖాతా, మొబైల్ నెంబర్ మీ ఆధార్ కార్డుకు జత చేసి ఉండాలి. లేనిపక్షంలో వెంటనే మీ సేవ సెంటర్, లేదా ఆధార్ ఎన్‌రోల్‌మెంట్ సెంటర్‌ని సంప్రదించి వివరాలను పొందుపరచాలి. తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులకు సామాజిక పింఛన్లు లభిస్తున్నప్పటికీ నిరుద్యోగ యువతను యువనేస్తంకి అర్హులుగానే పరిగణిస్తాతారు. శారీరక దివ్యాంగుల కోటా కింద పింఛన్ పొందేవారు అనర్హులు. ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ ఏ కారణం వల్లనైనా తొలగింపునకు గురైన వారు కూడా అనర్హులు. నేరస్తులుగా శిక్ష పడినవారు కూడా ఈ పథకానికి అర్హులు కాదు. ఇతర రాష్ట్రాల విశ్వవిద్యాలయాల నుండి డిగ్రీలను పొందినవారు కూడా అర్హులే. ఆధార్ కార్డు నెంబర్, గ్రాడ్యుయేషన్ సర్ట్ఫికెట్ అవసరం. పైన తెలిపిన నిబంధనల ప్రకారం అర్హులైన వారు ‘యువనేస్తం.ఏపీ.జీఓవీ.ఇన్ అనే వెబ్‌సైట్‌లో పేర్లు నమోదు చేసుకోవాలని అధికారులు సూచించారు.