సినిమా అభివృద్ధికి కృషిచేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ సినిమా పరిశ్రమ అభివృద్ధికోసం వివిధ రాజకీయ పార్టీలు 2018-19 తమ ఎన్నికల మేనిఫెస్టోలో చేర్చాలని తెలంగాణ సినిమా ప్రొటెక్షన్ ఫోరం చైర్మన్ సయ్యద్ రఫీ డిమాండ్ చేశారు. వివిధ రాజకీయ పార్టీలకు ‘తెలంగాణ సినిమా ప్రొటెక్షన్ ఫోరమ్’ 15 డిమాండ్లను ముందుకు తీసుకువచ్చిందని తెలిపారు. అవి ఈ విధంగా ఉన్నాయి. 1. తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ నేపథ్యంలో తెలంగాణ కళాకారులతో, తెలంగాణకు చెందిన సాంకేతిక నిపుణులతో నిర్మించిన సినిమాలను ‘తెలంగాణ సినిమాగా’ పరిగణించి, వాటికి పన్ను మినహాయింపు, సబ్సిడీ, ఉచితంగా లొకేషన్లు, ప్రత్యేక షోలు ఇచ్చి ప్రోత్సహించాలి. ఒక ప్రత్యేక కమిటీ స్క్రీనింగ్ చూసి, నియమాలను ఉల్లంఘించకుండా టాక్స్ మాఫీచేయాలి. ప్రభుత్వ ఛానెల్లో ప్రసారం చేయుటకు శాటిలైట్ హక్కులు కొనుగోలు చేయాలి. 2. తెలంగాణా రాష్ట్రంలో నిర్మించబడే ప్రతి సినిమాలో తెలంగాణాకు చెందిన స్థానిక కళాకారులకు, సాంకేతిక నిపుణులకు తప్పనిసరిగా 80 శాతం అవకాశం కల్పించాలి, అలాంటి సినిమాలకే రాయితీలు కల్పించాలి. 3. తెలంగాణ కళలపై తెలంగాణ ప్రజల జీవితాలను ఆవిష్కరిస్తూ, తెలంగాణ ఉద్యమ నేపథ్యంతో తెలంగాణ చరిత్రను ఆవిష్కరిస్తూ, మంచి విలువలతో తీసే సినిమాలను, అందులో పనిచేసిన కళాకారులను, సాంకేతిక నిపుణులను, నిర్మాతలను అవార్డులతో ప్రోత్సహించి గౌరవించాలి. 4. తెలంగాణలో నిర్మించబడ్డ అభిరుచిగల సినిమాలను ఎంపిక చేసి అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్స్‌కు పంపించే బాధ్యత ప్రభుత్వం తీసుకోవాలి. అలాగే ప్రతి ఏడాది తెలంగాణ ఫిల్మ్ ఫెస్టివల్ జరిపి మంచి సినిమాలను ప్రోత్సహించాలి. 5. వసతి లేని సినిమావాళ్ళకు ఇండ్లు కట్టుకోవడానికి భూమిలేదా ప్లాట్లు కట్టివ్వాలి. చిత్రపురికాలనీలో జరిగిన అక్రమాలపై ఎంక్వయిరీ జరిపి, అర్హత లేని వారిని తొలగించి, అర్హులకు ప్లాట్లుదక్కేలా చేయాలి. 6. లోబడ్జెట్ సినిమాలకు ప్రత్యేక షోలు కేటాయించాలి. ప్రతి సినిమా డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చొరవతో క్యూసిస్టమ్‌లో రిలీజ్ అయ్యేలా చూడాలి. 7. మండలానికొక మినీ థియేటర్ కట్టాలి, యువతకు స్వయం ఉపాధి కొరకు స్టూడియోలు, థియేటర్లు కట్టుకోవడానికి, సినిమాలు నిర్మించడానికి ఋణం కల్పించాలి. 8. ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలోనే ప్రతి థియేటర్‌లో డిజిటల్ స్క్రీనింగ్స్ జరిపే ఏర్పాట్లుచేయాలి. 9. సినిమా విడుదలకు పర్సెంటేజ్ విధానాన్ని అవలంబించుటకు చర్యలు తీసుకోవాలి. 10. థియేటర్ల కరెంటు బిల్లులు ఇండస్ట్రియల్ క్యాటగిరీకి మార్చాలి. 11. ఒక ఫిల్మ్ స్కూల్ స్థాపించాలి. 12. కాస్టింగ్ విధానాన్ని ప్రభుత్వ అనుమతి లేదా నిఘా ఉండేలా నిర్వహించాలనే నిబంధన పెట్టాలి. 13. హైదరాబాద్ దక్కని ఉర్దూలో తీసే సినిమాలకు ప్రత్యేక రాయితీలు కల్పించి, ప్రత్యేక అవార్డులు కూడా ఇచ్చి ప్రోత్సహించాలి. 14. ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ కాల్‌ఫర్ చేసిన ఎంప్లాయిమెంట్ అప్లికేషన్లు వెంటనే స్క్రూటినీ చేసి క్యూపద్ధతిలో వర్క్‌ఆర్డర్స్ ఇవ్వాలి. 15. మంచి కథలను ఎంపిక చేసి, ఎన్.ఎఫ్.డి.సి, లా టి.ఎస్.ఎఫ్.డి.సి. కూడా నిర్మాణాన్ని, సహనిర్మాణాన్ని చేపట్టి స్థానికులను ప్రోత్సహించాలి. ఈ డిమాండ్లను ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టి తెలంగాణ చిత్ర పరిశ్రమ అభివృద్ధికి కృషి చేయాలని రఫీ కోరారు.