భిన్నమైన పాత్రల్లో..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సమంత ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం యూ టర్న్. శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్, వినై కంబైన్స్ బ్యానర్‌పై శ్రీనివాస చిట్టూరి, రాంబాబు బండారు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఆది పినిశెట్టి, రాహుల్ రవీంద్రన్, భూమిక కీలక పాత్రధారులు. ఈ చిత్రం ఈ నెల 13న విడుదలవుతోంది. ఈ సందర్భంగా భూమిక పాత్రికేయులతో మాట్లాడుతూ... ఇదివరకు నేను నటించిన చిత్రాలకు భిన్నమైన పాత్రలో యూ టర్న్‌లో కనపడతాను. ఓ ఆర్టిస్టు భిన్నమైన పాత్రలు చేస్తేనే నటుడిగా సంతృప్తి.. గుర్తింపు దొరుకుతుంది. నేను కన్నడలో యూ టర్న్ చూశాను. యూ టర్న్‌లో నేను చేసిన పాత్రను మరే సినిమాలోనూ చేయలేదు. తెరపై ఎలా ఉంటుంది, ప్రేక్షకుల నుండి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందనేదానిపై ఎగ్జయటింగ్‌గా ఉన్నాను. సమంత అద్భుతంగా నటించింది. ఈగలో తన నటన చూశాను. సెట్స్‌లో తను ఇన్‌స్టెంట్ ఎనర్జీతో నటిస్తుంది. పాత్ర ఎంత నిడివి ఉందనడం కంటే పాత్ర ప్రాముఖ్యత ఉంది అని చూసుకుని దాన్ని ఇంపాక్ట్‌తో నటిస్తే చాలు. నేను కూడా మహిళా ప్రాధాన్యం వున్న పాత్రల్లో నటించాను. ఇపుడు లేడీ ఓరిటెంటెడ్ సినిమాలు క్రమంగా పెరుగుతున్నాయి. అయితే అలాంటి సినిమాల సంఖ్య ఇంకా పెరగాలి. మన రచయితలు అలాంటి పాత్రలను క్రియేట్ చేయాలి. తమిళంలో మంచి అవకాశాలు వస్తున్నాయి. 1999లో ఇండస్ట్రీకి వచ్చాను. ఇరవైయేళ్ళుగా నటిగా రాణిస్తున్నాను. ఒకప్పటితో పోల్చితే ఇపుడు నా చుట్టూ వున్న విషయాలను చూసే కోణం మారింది. సక్సెస్, ఫెయిల్యూర్ నన్ను ఎప్పుడూ బాధించవు. ఇప్పుడున్నంత సోషల్ మీడియా ఒకప్పుడు లేదు. కాబట్టి నాపై జయాపజయాలు పెద్దగా ఎఫెక్ట్ పడలేదు. హిందీలో ఈ ఏడాది విడుదల కాబోయే ‘కామోషి’ చితంలో నా పాత్ర చిన్నదే అయినా చాలా ఎఫెక్టివ్‌గా ఉంటుంది. అలాగే తమిళంలో ఓ సినిమా... తెలుగులో యు టర్న్ సినిమాలు చేశాను. ప్రతి పాత్రా వైవిధ్యమైనదే.