రూమర్స్ నమ్మొద్దు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఫ్యాషన్ ప్రపంచంలో మంచి గుర్తింపు తెచ్చుకొని సినిమాల్లోకి అడుగుపెట్టిన బ్యూటీ రకుల్‌ప్రీత్‌సింగ్. చిన్న చిన్న అవకాశాలను అందుకొని మొదట్లో బాగా కష్టపడిన ఈ బ్యూటీ అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోలతో సినిమాలు చేసింది. కోలీవుడ్, బాలీవుడ్‌లలో కూడా ఈ అమ్మడికి అవకాశాలు వచ్చాయి. అయితే తెలుగులో ఫ్లాప్స్ వల్ల అవకాశాలు తగ్గడంతో ఇతర ఇండస్ట్రీపై దృష్టి పెట్టిందనే రూమర్స్ వచ్చాయి. అయితే ఆ రూమర్స్‌పై రకుల్ ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో వివరణ ఇచ్చింది. స్పైడర్ సినిమా అనంతరం తెలుగులో అవకాశాలు తగ్గడంవల్ల స్లో అయ్యారని వార్తలు వస్తున్నాయనే ప్రశ్నకు రకుల్ మాట్లాడుతూ- స్లో అయ్యానని నేను అనుకోవడంలేదు. ఎందుకంటే స్పైడర్‌కి ముందు బిజీగా ఉన్నాను. ఆ సినిమా తరువాత కూడా వేరే సినిమాలకు ఒప్పుకున్నా. ముఖ్యంగా కోలీవుడ్‌లో నాలుగైదు సినిమాలకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చాను. అందుకే టాలీవుడ్‌లో మరో సినిమా చేయడం కుదరలేదు. ఈ సంగతి అందరికీ తెలిసినప్పటికీ మీడియా ఎందుకు రకుల్‌కి అవకాశాల్లేవు అని కథనాలు ప్రచురించిందో? తెలుగులో ఏడేళ్లలో 15 సినిమాలు చేశా. సక్సెస్ రేట్ సగమే ఉండవచ్చు కానీ ప్రేక్షకులు 75 శాతం మార్కులు వేశారు. నా కెరీర్ మొదలైంది ఇక్కడే కాబట్టి టాలీవుడ్‌ని వదిలే సమస్యే లేదు. అయినా అవకాశాలు లేవని ఎవరన్నారు? బాలీవుడ్‌లో అజయ్ దేవ్‌గన్‌తో, తమిళంలో సూర్యతో ఎన్‌జికె, కార్తితో 17తోపాటు శివకార్తికేయన్‌తో కూడా నటిస్తున్నా. తెలుగులో వెంకీమామ సైన్ చేశా. ప్రస్తుతం చాలా బిజీగా ఉన్నాను అంటూ అమ్మడు తన ప్రాజెక్టుల గురించి వివరిస్తూ రూమర్స్‌కు చెక్ పెట్టింది