క్రీడాభూమి

హీరో జొకోవిచ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూయార్క్: యూఎస్ ఓపెన్ టెన్నిస్ టైటిల్ సెర్బియా స్టార్ నొవాక్ జొకోవిచ్ పరమైంది. తొమ్మిదోసారి ఫైనల్‌కు చేరిన జొకోవిచ్, ముచ్చటగా మూడోసారి టైటిల్ సాధించాడు. తాజా విజయంతో పీట్ సంప్రాస్ గ్రాండ్‌శ్లామ్ రికార్డును చేరుకున్నాడు. న్యూయార్క్‌లోని ఆర్థర్ అషే స్టేడియంలో ఉత్కంఠ భరితంగా సాగిన యూఎస్ ఓపెన్ పురుషుల ఫైనల్‌లో ప్రపంచ 3 ర్యాంకర్, అర్జెంటీనా ఆటగాడు జాన్ మార్టిన్ డెల్ పొట్రోతో తలపడిన సెర్బ్ స్టార్, 6-3, 7-6 (7/4), 6-3 సెట్లతో విజయాన్ని కైవసం చేసుకుని ట్రోఫీని ముద్దాడాడు. జొకోవిచ్ కెరీర్‌లో ఇది 14వ గ్రాండ్‌శ్లామ్. యూఎస్ స్టార్ ఆటగాడు పీట్ సంప్రాస్ రికార్డుకు చేరిన నొవాక్, రాఫెల్ నాదల్‌కంటే మూడు, రోగర్ ఫెదరర్‌కంటే ఆరు గ్రాండ్‌శ్లామ్‌లు వెనుకబడి ఉన్నాడు. ముచ్చటగా మూడోసారి (2011, 2015 చాంపియన్) టైటిల్ సాధించిన 31 ఏళ్ల నొవాక్, గత ఏడాది మోచేతి గాయం కారణంగా టోర్నీకి దూరంగా ఉండటం తెలిసిందే. తొమ్మిదేళ్ల క్రితం యూఎస్ చాంపియన్‌షిప్ సాధించిన ప్రపంచ 3వ ర్యాంకర్ పొట్రోకు రెండో శ్లామ్ ఫైనల్‌లోనే దారుణ పరాజయం ఎదురైంది. పొట్రోపై నొవాక్‌కు ఇది పదిహేనొవ విజయమైతే, శ్లామ్‌పరంగా ఐదో గెలుపు. ఇదిలావుంటే, గత 55 మేజర్ టోర్నీల్లో 50 విజయాలు ‘బిగ్ ఫోర్ (ఫెదరర్, నాదల్, జొకోవిచ్, ఆండ్రీ ముర్రే)’ పేరిట నమోదై ఉండటం గమనార్హం.