క్రైమ్/లీగల్

ఐదు ఆలయాల్లో వరుస చోరీలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోడూరు, సెప్టెంబర్ 10: మండల పరిధిలోని లింగారెడ్డిపాలెం గ్రామంలో ఆదివారం రాత్రి ఐదు దేవాలయాలలో హుండీలను పగులగొట్టి విధ్వంసం సృష్టించిన దొంగల ముఠాను త్వరలోనే పట్టుకుంటామని అవనిగడ్డ డీఎస్పీ పోతురాజు పేర్కొన్నారు. సోమవారం ఉదయం దేవాలయాల పరిసరాలలో హుండీలు చెల్లాచెదరుగా పడి ఉన్న దృశ్యాలను చూసిన గ్రామస్థులు పోలీసులకు సమాచారం అందించారు. కోడూరు ఎస్‌ఐ ప్రియకుమార్ తన సిబ్బందితో వెళ్లి సంఘటన స్థలాన్ని పరిశీలించగా ఉన్నతాధికారుల సూచనల మేరకు క్లూస్ టీమ్‌ను రప్పించారు. దేవస్థానం కార్య నిర్వహణాధికారి తిక్కిశెట్టి వీర వెంకట మోహనరావు ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తును ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. అవనిగడ్డ సీఐ మూర్తి కూడా లింగారెడ్డిపాలెంలో పర్యటించారు.