మెయన్ ఫీచర్

ఇంతకూ.. ఎవరి మాటలు నమ్మాలి?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘నేను నోరు విప్పానంటే వందలాది మంది జైలుకు పోతారు’.. ఈ మాట అన్నది సాదాసీదా వ్యక్తి కాదు.. సాక్షాత్తూ భాజపా ఎంపీ జీవీఎల్ నరసింహారావు. ఈయన స్వస్థలం గుంటూరు జిల్లా. ఉత్తరప్రదేశ్ కోటాలో రాజ్యసభకు ఎన్నికయ్యారు. ఎన్‌డీఏ కూటమి నుంచి, మోదీ మంత్రివర్గం నుంచి తెలుగుదేశం పార్టీ నిష్క్రమించింది. దీంతో ఇప్పుడు భాజపాకు, తెదేపాకు సయోధ్య చెడింది. ఇరు పార్టీల మధ్య హోరాహోరీగా సమరం సాగుతోంది. తెదేపా అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఆర్థిక దుర్వినియోగానికి పాల్పడ్డారన్నది భాజపా ఆరోపణ. ‘కేంద్రం ఇచ్చిన నిధుల్లో వందల కోట్ల రూపాయలు ఏపీ ప్రభుత్వ ఖాతాల ద్వారా దుర్వినియోగం అయ్యాయి..’ అని జీవీఎల్ తీవ్రస్థాయిలో ఆరోపిస్తున్నారు. ‘ఇది శుద్ధ అబద్ధం’ అంటారు ఏపీ ప్రణాళికా మండలి ఉపాధ్యక్షుడు కుటుంబరావు. ఈ ఇద్దరి మాటల్లో మనం దేన్ని నమ్మాలి?
‘అరెస్టు అయ్యేవరకు లల్లూప్రసాద్ యాదవ్ నిర్దోషిననే చెప్పుకున్నాడు’ అన్నారు జీవీఎల్. అంటే- ‘నారా’ వారిని అరెస్టుచేసే ధైర్యం బిజెపికి ఉందా? తృతీయ కూటమికి అవకాశం కలసివస్తే చంద్రబాబు ప్రధాని కావాలని ఆశిస్తున్నారని కొందరు అంటున్నారు. ఆరోపణల సంగతి అలా ఉంచి, సిఐడి లేదా సిబిఐ విచారణ జరిపిస్తే ఎవరు అబద్ధం చెపుతున్నారో తేలిపోతుంది కదా!
తెలంగాణలో ఇటీవల ఒక చిల్లర రాజకీయం నడిచింది. పాత్రధారి పేరు విజయలక్ష్మి, సూత్రధారులు టిఆర్‌ఎస్‌వారు అన్నది ఆరోపణ. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు గండ్ర వెంకటరమణారెడ్డికి నాలుగు సంవత్సరాలుగా విజయలక్ష్మి సన్నిహితంగా ఉన్నారట! ఇప్పుడామె ఎవరో తనకు తెలియదని అంటున్నారు గండ్ర. ఈమె మదర్ థెరిసా సంస్థ నిర్వాహకురాలు. మనం ఎవరి మాటలు నమ్మాలి? ‘కాంగ్రెస్ నాయకులు తప్పుచేస్తారంటే నమ్మటం కష్టం.. ఎందుకంటే అది మహాత్మా గాంధీ పార్టీ కదా?’ అని వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నవారు లేకపోలేదు. అటు గండ్ర, ఇటు విజయలక్ష్మి పరస్పరం పోలీసు కేసులు పెట్టుకున్నారు. వాస్తవాలు ఏమిటో విచారించే పోలీసులకు తెలియాలి.
భారతదేశం పది సంవత్సరాల క్రితం విమానాలు కొనుగోలు ఒప్పందాన్ని ఫ్రాన్స్‌తో కుదుర్చుకున్నది. అప్పుడు యుపీఏ ప్రభుత్వం అధికారంలో ఉంది. ఈ జెట్ విమానాల కొనుగోళ్ల సందర్భంగా అనిల్ అంబానీకి 130 లక్షల కోట్ల ముడుపులు ముట్టాయని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆరోపించాడు. ‘ఇది అబద్ధం’ అని ప్రస్తుత రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ ఖండించారు. మనం ఎవరిని నమ్మాలి?? చెన్నైకు చెందిన ఓ పత్రిక అంచనాల మేరకు 2050 నాటికి భారతదేశంలో 30 కోట్ల మంది ముస్లిములు ఉంటారు. ప్ర పంచంలో ముస్లిం మెజారిటీ దే శాల్లో ఇండియా అతి పెద్ద దేశమవుతుంది. దీనికి కారణం హిందువులు, క్రైస్తవులుగా మారిపోతారు. కుటుంబ నియంత్రణను అమలు చేయడం ద్వారా హిందువులు మైనారిటీలు అవుతారు. బహుభార్యాత్వం వల్ల ముస్లిములు మెజారిటీగా మారిపోతారు. ఇదీ విశే్లషణ. దీనికి సామ్యవాదులు ఒప్పుకోవటం లేదు. ఒక వ్యక్తి హిందువైనా, ముస్లిమైనా ఒకటే. మనిషికి కావలసింది మతం కాదు. ఆర్థిక వికాసం, కూడు, గూడు, గుడ్డ. అలాంటప్పుడు ఇండియాలో ఎవరు మెజారిటీ? ఎవరు మైనారిటీ అనే విషయం ఆలోచించటం మూర్ఖత్వం. మరి ఈ రెండు అభిప్రాయాల్లో దేనిని నమ్మాలి?
ఇటీవల మరణించిన తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎం.కరుణానిధి గొప్ప రచయిత, మహా నాయకుడు, తమిళ ఆత్మగౌరవానికి సంకేతం. వక్త-ప్రవక్త ఇవన్నీ నిజమేనా? అతని హయాంలో అవినీతి జరగలేదా? ఈయన కుటుంబ సభ్యులంతా 2జీ స్పెక్ట్రం వంటి కేసుల్లో తీహార్ జైలుపాలైనారు. హిందీ వ్యతిరేక ఉద్యమంలో ఆయన జాతీయతా భావాన్ని విడనాడాడు. హిందీ, హిందూ సంస్కృతి, సంస్కృతం అంటే ఈయనకు ద్వేషం. పురాణ పురుషుడైన శ్రీరాముడి చిత్రపటానికి చెప్పుల దండలు వేసి ఊరేగించాడు. ఇతడు నాస్తికుడు. ఎంజీఆర్, కామరాజ్ నాడార్, రాజాజీ వంటి నాయకులను ద్వేషించాడు, అవమానించాడు. ఇతని అసలు పేరు దక్షిణామూర్తి, కలం పేరు కరుణానిధి. ఐతే ఈయనలో దాక్షిణ్యం లేదు, కరుణ లేదు. తమిళనాడు నుండి కంచి కామకోటి చంద్రశేఖర సరస్వతి వంటి స్వాములను తరిమికొట్టాడు. హేతువాదం పేరుతో బూతువాదం ప్రచారం చేశాడు. ‘ప్రత్యేక తమిళ ఈలం’ నిర్మించాలని ఎల్‌టిటిఈ నేత వేలుపిళ్లై ప్రభాకరన్‌తో చేతులు కలిపాడు. ఎర్ర చందనం స్మగ్లర్లలో డిఎంకే పార్టీవారున్నారు. జయలలితను శాసనసభలో అవమానించినా నోరు మెదపలేదు. ఆ తర్వాత అధికారంలోకి రాగానే జయలలిత అర్ధరాత్రి వేళ కరుణానిధిని అరెస్టు చేయించి తన ప్రతీకారం తీర్చుకుంది. ఆమె కోట్లాది రూపాయల అక్రమ సంపాదన చేసి నేలమాళిగలలో దాచిపెట్టింది. వందలాది కిలోల బంగారం, వజ్రాలు కూడబెట్టింది. వాజపేయి వంటి మహానేతలను ముప్పుతిప్పలు పెట్టింది. హత్యానేరంపై కంచి పీఠాధిపతి జయేంద్ర సరస్వతిని జైలుకు పంపింది. కరుణానిధి, జయలలితల గొప్పతనం గురించి ప్రచారంలో ఉన్న విషయాల్లో కొన్ని నిజాలు, కొన్ని అసత్యాలు అన్నది ఎందరికి తెలుసు?
మానవశాంతి కోసం, నిరుపేద రో గుల సేవ కోసం మదర్ థెరిసా ఇండియాకు వచ్చింది. ఆమె త్యాగాలకు ఫలితంగా సెయింట్‌హుడ్ పొందింది. ఇది ఒక నిశ్చితాభిప్రాయం. రాంచీలో ఆమె స్థాపించిన నిర్మలామిషన్‌లో వందలాది పసిపిల్లలను అమ్మి భారీగా హూమన్ ట్రాఫికింగ్ జరుపుతున్నారు. కన్‌షెషన్ పేరుతో లైంగిక వేధింపులు మొదలయినాయి. స్వయంగా బిషప్పులే నన్స్ (సన్యాసినుల)పై అత్యాచారాలు చేస్తున్న ఘటనలు కేరళలో వెలుగు చూస్తున్నాయి. ఈ కేసుల్లో నిందితులకు కేరళ హైకోర్టు బెయిల్ ఇవ్వడానికి నిరాకరించింది. మన దేశంలోని స్వచ్ఛంద సంస్థలు విదేశాల నుంచి వస్తున్న నిధులను మతం మార్పిడులకు వినియోగిస్తున్నాయి. వీటిపై మోదీ ప్రభుత్వం కఠినంగా వ్యవహరించడంతో విదేశీ నిధులు పడిపోయాయి. అందుకు ఆగ్రహించిన బిషప్పులు న్యూ ఢిల్లీ, అహమ్మదాబాదు వంటి నగరాల్లో బిజెపిని ఓడించండని అంటూ క్రైస్తవ మతస్తులకు బహిరంగంగా పిలుపునిచ్చి భారత ‘సెక్యులర్’ వ్యవస్థను మంటగలిపారు.
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ధార్మికుడు, పరిపాలనాదక్షుడు. వేములవాడ, యాదాద్రి, తిరుపతి, విజయవాడ దుర్గమ్మలకు భూరి విరాళాలు అందించారు. మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, హరిత హారం, షాదీ ముబారక్, కల్యాణ లక్ష్మి, బ్రాహ్మణ సంక్షేమం వంటి అసంఖ్యాక పథకాల ద్వారా బంగారు తెలంగాణ నిర్మించడంలో కృషి చేస్తున్నారు. భారతదేశాన్ని రక్షించాలనే కోరికతో తృతీయ ఫ్రంటును కూడగట్టాలని ఆయన యత్నిస్తున్నారు. డబుల్ బెడ్‌రూం హౌస్ వంటి పథకాలతో పేదల కన్నీళ్ళు తుడుస్తున్నారు. ఇదంతా అసత్యం అంటున్నారు విమర్శకులు. ముఖ్యంగా కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీల వారు కెసిఆర్‌పై దుమ్మెత్తి పోస్తున్నారు. అయితే- దళితుడిని ముఖ్యమంత్రిగా చేస్తానని, ఎస్సీ-ఎస్టీలకు మూడు ఎకరాల భూమి ఇస్తానని, ఇక్కడి విద్యార్థులకు విదేశాల్లో కూడా ఉద్యోగాలు వచ్చేలా చేస్తానని కేసీఆర్ గొప్పగా ప్రకటించారు. ఇందులో ఎన్ని నెరవేరాయో ప్రజలకు తెలియనిది కాదు. తెలంగాణలో ఒకే కుటుంబం పాలిస్తోందనే ఆరోపణలను ఆయన ఎదుర్కొంటున్నారు. స్వామి పరిపూర్ణానంద స్వామిపై నగర బహిష్కరణ విధించారు. రాజ్యాంగ వ్యతిరేకంగా ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లు ప్రకటించి ఓ వర్గం వారి మెప్పు కోసం ప్రయత్నిస్తున్నారు. హరిత హారం పేరిట భారీగా నిధులు దుర్వినియోగం అయినట్టు విపక్షాలు ఆరోపిస్తున్నాయి. పోడుభూముల నుండి గిరిజనులను గెంటివేసి వాటిని కార్పొరేట్ సంస్థలకు ధారాదత్తం చేస్తున్నారని వామపక్షాల నేతలు తమ్మినేని వీరభద్రం, చాడ వెంకటరెడ్డి ఆరోపించారు. వీరిలో మనం ఎవరిని మాటలు నమ్మాలి? 2006 అటవీ హక్కుల చట్టాన్ని విస్మరించి గిరిజనుల భూములు ఆక్రమించటం దుర్మార్గం అంటున్నారు.
నరేంద్ర మోదీ భారత ప్రధానిగా అంతర్జాతీయ కీర్తిని ఆర్జించాడు. స్వచ్ఛ భారత్, మేక్ ఇన్ ఇండియా, జనధన్ యోజన వంటి ఎన్నో ప్రజోపయోగకర పథకాల విజయవంతంగా అమలు చేశాడు. పెద్దనోట్ల రద్దుతో కొందరు బడాబాబులు ఇబ్బందుల పాలయ్యారు. అనేక రాష్ట్రాల్లో భాజపా ప్రభుత్వాలు ఏర్పాటయ్యాయి. జాతీయతా భావాన్ని పెంచేలా మోదీ కృషి చేస్తున్నారు. సాంస్కృతిక పునరుజ్జీవనం జరుగుతున్నది. ‘సచ్ఛ్‌కా వికాస్’ అంటూ అందరి శ్రేయస్సును చూస్తున్నారు. అవినీతి ఆగిపోయిందని భాజపా నేతలు అంటున్నారు. ఇవన్నీ నిజమేనా? పెద్దనోట్ల రద్దు చర్యవల్ల లక్షలాది మంది వ్యాపారులు వీధినపడ్డారు. బ్యాంకుల వద్ద క్యూలలో నిలబడలేక వందల మంది మరణించారు. దేశరక్షణ విషయం పెద్దగా ప్రగతి లేదు. బిజెపి స్వంత ఎజెండా ఆగిపోయింది. జిఎస్‌టి పేరుతో ఆర్థిక నష్టాలు పెరిగాయి. ఆక్రమిత కశ్మీరు భారతదేశంలో అంతర్భాగం కాలేదు. మతం మార్పిడులను ఆపలేకపోయారు. విదేశీ బ్యాంకులలో దాచిన నల్లధనంలో ఒక్క రూపాయి కూడా వెనక్కి రాలేదు. నీరవ్ మోదీ, విజయ్ మాల్యా, లలిత్ మోదీ వంటి వేల కోట్ల ధనాన్ని దోచుకున్న ఆర్థిక నేరస్థులు ఇండియాకు రాలేదు. మరి నల్లకుబేరులను దారిలోకి తెచ్చామంటున్న పాలకుల మాటల్లో వాస్తవం ఎంత? *

-ప్రొ.ముదిగొండ శివప్రసాద్