రాష్ట్రీయం

మా వంతు ఊరట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, సెప్టెంబర్ 10: పెట్రోల్, డీజల్‌పై లీటరుకు 2 రూపాయలు తగ్గిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర అసెంబ్లీలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సోమవారం ప్రకటన చేశారు. ప్రజలు పడుతున్న ఇబ్బందులను గమనించి మనసున్న వ్యక్తిగా కొంత మేరకు పెట్రో భారాన్ని తగ్గించేందుకు నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. గత నాలుగు సంవత్సరాల్లో కేంద్రానికి వచ్చిన పెట్రో ఆదాయంపై శే్వతపత్రం విడుదల చేయాలని, కేంద్రం కూడా తక్షణమే కళ్లు తెరచి పెట్రో ధరలను తగ్గించాలని డిమాండ్ చేశారు. పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెరిగిన నేపథ్యంలో రాష్ట్ర అసెంబ్లీలో ఈ మేరకు ముఖ్యమంత్రి ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం గత నాలుగు సంవత్సరాలుగా పెట్రోల్, డీజిల్ ధరలను అదుపులేకుండా పెంచడం పట్ల దేశ వ్యాప్తంగా ఆగ్రహం పెల్లుబుకుతోందన్నారు. సోమవారం ప్రతిపక్ష పార్టీలు నిర్వహించిన బంద్‌కు ప్రజల నుంచి వచ్చిన విశేష స్పందనే ఇందుకు నిదర్శనమన్నారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక, బాధ్యతారహిత విధానాలతో పెట్రోల్, డీజల్ ధరలు అన్ని వర్గాల ప్రజలకు భరించలేని భారంగా మారాయన్నారు. ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్న ఈ ధరలను తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వ పరంగా గత నాలుగున్నరేళ్లుగా ఎటువంటి చర్యలను తీసుకోకపోవడం గర్హనీయమని వ్యాఖ్యానించారు. దేశ వ్యాప్తంగా జరుగుతున్న ఈ బంద్‌కు సంఘీభావంగా తెలుగుదేశం పార్టీ శ్రేణులు నిరసన కార్యక్రమాల్లో పాల్గొని ప్రజల ఆవేదనలో పాలు పంచుకున్నారన్నారు. అంతర్జాతీయ మార్కెట్‌లో పెట్రోలియం ధరలు పెరగడం వల్ల, రాష్ట్రాలు వ్యాట్ రేట్లను పెంచడం వల్ల ధరలు పెరిగాయని, తగ్గించడం సాధ్యం కాదని కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి కరాఖండిగా చెప్పారన్నారు. ఈ ప్రకటన వాస్తవ దూరంగా, ప్రజలను మభ్యపెట్టేవిధంగా ఉందన్నారు. బాధ్యతారహితమైన ఇటువంటి
ప్రకటనలను ఖండిస్తున్నామన్నారు. 2013లో క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌కు 105.52 డాలర్లు ఉండగా, 2015-16లో 46 డాలర్లకు పడిపోయిందన్నారు. ప్రస్తుతం 72.23 డాలర్లుగా ఉందన్నారు. 2014లో పెట్రోల్ ధర 49.60 రూపాయలు కాగా, ఇప్పుడు 86.71 రూపాయలకు చేరుకుందన్నారు. డీజిల్ కూడా ఇదే కాలంలో 62.98 రూపాయల నుంచి 79.98కి చేరిందన్నారు. గతంలో అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడాయిల్ ధరలు తగ్గినప్పటికీ, మన దేశంలో కేంద్రం తగ్గించకుండా అదనపు పన్నులు, సెస్‌లను విధించిందని గుర్తు చేశారు. ఇప్పుడు మాత్రం క్రూడాయిల్ ధరలు పెరిగాయంటూ ధరలను పెంచుతున్నారని, ఒక విధానం లేకుండా కేంద్రం నిరంకుశంగా వ్యవహరించడాన్ని అన్ని వర్గాల ప్రజలు, రాజకీయ పార్టీలు తప్పుపడుతున్నాయన్నారు. ఎక్సైజ్ సుంకం కూడా 2014 జూన్‌లో లీటరుకు 3.56 రూపాయలు ఉండగా, 2018 నాటికి 19.48 శాతానికి పెంచారన్నారు. ఒక వైపు ఇబ్బుడిముబ్బుడిగా పెరిగిన ధరలతో వినియోగదారులు ఇబ్బందులు పడుతుంటే కేంద్ర ప్రభుత్వం వివిధ పన్నులను, సెస్‌లను ఆదనంగా మోపిందని ఆరోపించారు. ఎక్సైజ్ డ్యూటీ ద్వారా గత నాలుగున్నర ఏళ్లలో 10 లక్షల కోట్ల రూపాయల మేర సమకూర్చుకున్నప్పటికీ, సామాన్య ప్రజలపై భారం తగ్గించేందుకు చొరవ చూపించకపోవడం దుర్మార్గమన్నారు. ఇన్‌కం టాక్స్, డివిడెండ్ రూపంలో కేంద్ర ప్రభుత్వానికి మరో 13 లక్షల కోట్ల రూపాయలు సమకూరిందన్నారు. పెట్రోల్, డీజల్ ధరలపై ఎక్సైజ్ డ్యూటీ, సెస్‌ల ద్వారా 23 లక్షల కోట్ల రూపాయల ఆదాయం వచ్చినప్పటికీ, పెట్రో ధరల నుంచి ఎటువంటి ఉపశమన చర్యలు చేపట్టకపోవడం బాధాకరమన్నారు. భారీగా అదనపు ఆదాయం పొందుతూ, దేశ ప్రజలపై మరింత భారాన్ని మోపడం ప్రజా వ్యతిరేక చర్యగా ఆరోపించారు. ఈ నేపథ్యంలో కేంద్రం కూడా పేద, సామాన్య మధ్య తరగతి ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని, పెట్రోధరలను తగ్గించాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. ప్రస్తుతం లీటరుకు 4 రూపాయల చొప్పున ఉన్న రాష్ట్ర అదనపు పన్నును సగానికి తగ్గిస్తున్నట్లు సీఎం ప్రకటించారు. పెట్రోల్, డీజిల్‌పై లీటరుకు రెండు రూపాయలు తగ్గిసే, రాష్ట్ర ఖజనాపై 1120 కోట్ల రూపాయల మేరకు భారం పడుతుందని తెలిపారు. రాష్ట్రం లోటు బడ్జెట్‌లో ఉన్నప్పటికీ, ప్రజలపై కేంద్రం మోయలేని భారాన్ని విధించడాన్ని దృష్టిలో ఉంచుకుని రెండు రూపాయలు తగ్గిస్తున్నట్లు తెలిపారు. ఈ మేరకు ఒక తీర్మానాన్ని ఆయన ప్రవేశపెట్టారు. కేంద్రం కూడా బాధ్యతగా వ్యవహరించి, ఎక్సైజ్ డ్యూటీని గణనీయంగా తగ్గించాలని తీర్మానించారు. దానిని ఎమ్మెల్యేలు బండారు సత్యనారాయణ మూర్తి, ఎ.రాధాకృష్ణ, ఎ.ఆనందరావు, బి.జయనాగేశ్వర రెడ్డి, ఆంజనేయులు, కె.మృణాళిని బలపరించారు.