రాష్ట్రీయం

దేవుడ్నీ వదలని చంద్రబాబు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, సెప్టెంబర్ 10: దైవం అంటే ముఖ్యమంత్రి చంద్రబాబుకు భయం-భక్తి రెండూ లేవని, తన రాజకీయ స్వార్థం కోసం భగవంతుడిని కూడా వాడుకుని వదిలేయగల మోసగాడంటూ వైసీపీ అధినేత జగన్ ఘాటుగా విమర్శించారు. బ్రాహ్మణ సంఘాల ప్రతినిధులతో విశాఖలో సోమవారం జరిగిన ఆత్మీయ సదస్సులో ఆయన మాట్లాడుతూ తన దోపిడీకి భగవంతుడ్ని కూడా వదిలిపెట్టలేదన్నారు. గోదావరి, కృష్ణా పుష్కరాల్లో అభివృద్ధి పనులు పేరిట రూ.3.200 కోట్ల కుంభకోణానికి పాల్పడ్డారని ఆరోపించారు. ప్రధాన దేవాలయాల్లో పారిశుద్ధ్య పనుల నిర్వహణ పనులు గతంలో రూ.7 లక్షలు ఖర్చు చేస్తే ముఖ్యమంత్రి చంద్రబాబు తన బంధువుభాస్కర నాయుడికి రూ.32 లక్షలకు అప్పగించారని ఆరోపించారు. దేవాలయాల పారిశుద్ధ్య పనుల్లోనూ కమిషన్లకు కక్కుర్తి పడుతున్నారన్నారు. అన్నిటి కంటే దారణమైన
ఘటన విజయవాడ కనకదుర్గ అమ్మవారి ఆలయంలో తాంత్రిక పూజల విషయంలో కూడా ప్రభుత్వం తనపై వచ్చిన ఆరోపణలను ఖండించుకోలేదన్నారు. దేవాలయాలకు చెందిన వందల కోట్ల విలువైన భూములను తన అనుకూల వర్గాలకు కారు చౌకగా విక్రయించడం, లీజు కివ్వడం చేస్తున్నారని ధ్వజమెత్తారు. సిద్దార్ధ కళాశాలకు రూ.1100 కోట్ల విలువైన భూములను సంవత్సరానికి ఎకరాకు రూ.లక్షకే లీజుకిచ్చారన్నారు. చెన్నైలోని సదావర్తి భూములను కారు చౌకగా విక్రయించేశారన్నారు.
ఇక భగవంతునికి, ప్రజలకు సంధాన కర్తగా ఉండే అర్చకులను కూడా చంద్రబాబు వంచించాడన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాష్ట్రంలో 14 వేల దేవాలయాలకు ధూప, దీప, నైవేద్యాల కింద ప్రతి నెలా నిధులు చెల్లిస్తే, ఆ దేవాలయాలను 3000కు తగ్గించి అర్చకుల పొట్ట కొట్టారని మండిపడ్డారు. బ్రాహ్మణులకు చదువు దైవం ఇచ్చిన వరమని, చదువుకున్నా ఉద్యోగాలు రాని పరిస్థితుల్లో అర్చక వృత్తిని కూడా దూరం చేసేలా ప్రభుత్వం ప్రవర్తిస్తోందన్నారు. చంద్రబాబు పాలనలో అర్చక వృత్తి కడుపునింపదన్నారు. బ్రాహ్మణ సామాజిక వర్గం కోసం గత ఎన్నికలకు ముందు చంద్రబాబు మేనిఫెస్టోలో పేర్కొన్న అంశాల్లో ఒక్కటి కూడా అమలు చేయలేదన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన బ్రాహ్మణ ప్రతినిధులు తమ సమస్యలు ఏకరవు పెట్టారు. ముఖ్యంగా ఇంజనీరింగ్ రెండో సంవత్సరం చదువుతున్న జ్యోతి స్వరూప అనే విద్యార్థిని తనకు ఫీజు రీయింబర్స్ రావట్లేదని పేర్కొనగా జగన్ స్పందించారు. అన్ని వర్గాలను ఆదుకునేలా వైసీపీ ప్రకటించిన నవరత్నాల అమల్లో ఎటువంటి కుల,మత, రాజకీయ ప్రమేయం ఉండదని ఉద్ఘాటించారు. వైసీపీ ఎన్నికల మేనిఫెస్టోలో మీ అందరి ఆలోచనలు, సూచనలు పరిగణలోకి తీసుకుంటామని హామీ ఇచ్చారు.
అంతకు ముందు ఉదయం తాటిచెట్లపాలెం నుంచి పాదయాత్ర మొదలై, రైల్వే న్యూకాలనీ, దొండపర్తి, ఆశీల్‌మెట్ట మీదుగా సదస్సు వేదికకు చేరుకుంది. సమావేశంలో మాజీ చీఫ్ సెక్రటరీ ఐవైఆర్ కృష్ణారావు, ఎమ్మెల్యే కోన రఘుపతి, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, తదితరులు పాల్గొన్నారు.

చిత్రం..తాటిచెట్లపాలెంలో దివ్యాంగులతో మాట్లాడుతున్న జగన్