రాష్ట్రీయం

ఇది బహిరంగ దోపిడీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, సెప్టెంబర్ 10: నాలుగున్నర సంవత్సరాల నరేంద్ర మోదీ పాలనలో రూ. 11.50 లక్షల కోట్లు ప్రభుత్వం దోచుకుందని, ఇది పబ్లిక్ దోపిడీ అని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు డాక్టర్ ఎన్ రఘువీరారెడ్డి ధ్వజమెత్తారు. పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరల పెంపునకు నిరసనగా జరిగిన భారత్ బంద్‌ను ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో సోమవారం ఉదయం 8 గంటలకు విజయవాడలో రఘువీరారెడ్డి ప్రారంభించారు. తొలుత ఆంధ్రరత్నభవన్ నుంచి ఎడ్లబండ్లు, రిక్షాలు, కట్టెలతో ప్రదర్శనగా బయలుదేరారు. ఏలూరు రోడ్డు, గాంధీనగర్, లెనిన్ సెంటర్, బీసెంట్ రోడ్డు మీదుగా నగరంలోని పలు ప్రాంతాలు తిరుగుతూ బంద్‌ను నిర్వహించారు. అనంతరం లెనిన్ సెంటర్‌లో మీడియాతో రఘువీరారెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో ఎనిమిది రాజకీయ పార్టీలు, దేశంలో 22 పార్టీలతో కలిసి రాహుల్ గాంధీ నాయకత్వంలో భారత్‌బంద్ పిలుపు ఇవ్వడం జరిగిందన్నారు. ఎన్నికల ముందు బీజేపీ, ముఖ్యంగా నరేంద్రమోదీ పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు తగ్గిస్తామని చెప్పి నేడు విపరీతంగా పెంచారన్నారు. అంతర్జాతీయంగా ముడి సరుకు ధర తగ్గినా విపరీతంగా పెంచుతున్నారన్నారు. తగ్గిన ముడి సమురు లెక్కలను చూస్తే లీటర్ పెట్రోల్ రూ. 48లకు, లీటర్ డీజిల్ రూ. 37లకు అమ్మాలని డిమాండ్ చేశారు. ట్రాక్టర్‌లతో వ్యవసాయం చేయలేమంటూ, ఆటోలతో నడపలేమంటూ, గ్యాస్ కొనలేమంటూ కార్యకర్తలు నినదించారు. నేడు మోదీ ఎలా ఉన్నారంటే ఒక క్రికెటర్ సెంచరీ కొట్టడానికి ఏ విధంగా ఆరాటపడతాడో పెట్రోల్‌ను రూ. 100లకు తీసుకువెళ్లాలి. డాలర్ ధరను రూ. 100లకు తీసుకువెళ్లాలనే ఆరాటంతో ఊగిపోతుంటే ఇటు సామాన్యులు ఉడికిపోతున్నారన్నారు. ఇప్పటికైనా పెట్రోల్, డీజిల్‌ను జీఎస్టీ పరిధికి తీసుకురావాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుందన్నారు. జీఎస్టీ పరిధిలోకి తీసుకువస్తే లీటర్‌కు రూ. 10 నుంచి రూ. 15లు నేరుగా తగ్గిపోతుందన్నారు. కర్నాటక రాష్ట్రంలో కంటే ఆంధ్రప్రదేశ్‌లో డీజిల్ రూ. 7 ఎక్కువగా ఉందన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీ హయాంలో పక్క రాష్ట్రాల కంటే పెట్రోల్, డీజిల్ తక్కువగా ఉండేవన్నారు.

చిత్రం..ఎడ్లబండిపై ప్రదర్శనగా వెళుతున్న పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి, కాంగ్రెస్ కార్యకర్తలు