రాష్ట్రీయం

తెరాసదే మళ్లీ అధికారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 10: అభ్యర్థుల ఖరారుతో టీఆర్‌ఎస్ పార్టీలో రేగిన ఎగిసిన అసంతృప్తి సెగలను ఆర్పడానికి పార్టీ అధిష్టానం రంగంలోకి దిగింది. టికెట్ ఆశించి భంగపడిన నేతలను ఒకోక్కరిని స్వయంగా పిలిపించుకుని చర్చించే బాధ్యతను మంత్రి కేటీఆర్‌కు పార్టీ అధినేత కేసీఆర్ అప్పగించారు. అభ్యర్థులను ప్రకటించాక పార్టీలో పెల్లుబికిన అసంతృప్తిని రెండు రోజులుగా ప్రచార, ప్రసార మాధ్యామాల ద్వారా కేసీఆర్ గమనించినట్టు తెలిసింది. పార్టీ కోసం మొదటి నుంచి కష్టపడిన వారిని, తెలంగాణ ఉద్యమంలో చురుకుగా పని చేసిన ఎవరినీ దూరం చేసుకోకూడదని కేసీఆర్ నిర్ణయించారు. సామాజిక, రాజకీయ సమీకరణలు, సుస్థిర ప్రభుత్వం వంటి అనేక కోణాల నేపథ్యంలో ఈ సారి కొందరికి టికెట్ ఇవ్వడం సాధ్యం కాలేదన్నారు. మళ్లీ వచ్చేది టీఆర్‌ఎస్ ప్రభుత్వమేనని, భవిష్యత్‌లో తప్పకుండా సముచిత స్థానం కల్పించనున్నట్టు తన మాటగా హామీ ఇవ్వాల్సిందిగా పార్టీ ముఖ్యులను అధినేత ఆదేశించినట్టు పార్టీ వర్గాల సమాచారం. అభ్యర్థుల జాబితా ప్రకటించాక వివిధ నియోజకవర్గాలలో టికెట్ దక్కలేదన్న అసంతృప్తిని వ్యక్తం చేసిన నేతల సమాచారాన్ని పార్టీ బాధ్యులు, ఇంటెలిజెన్స్ వర్గాల ద్వారా కేసీఆర్ తెప్పించుకున్నారు. అసమ్మతి నేతలతో మాట్లాడి బుజ్జగించాల్సిందిగా సంబంధిత జిల్లాల మంత్రులు, ఎంపీలను కేసీఆర్ పురమాయించారు. ఒకవేళ మీ స్థాయిలో వినకపోతే వారిని మంత్రి కేటీఆర్ వద్దకు తీసుకరావాల్సిందిగా సూచించినట్టు తెలిసింది. కేటీఆర్ చెప్పినా వినని పక్షంలో చివరగా తన వద్దకు తీసుకరావాల్సిందిగా పార్టీ నేతలకు అధినేత సూచించినట్టు సమాచారం. దీంతో వెంటనే రంగంలోకి దిగిన ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, మధిర టికెట్ ఆశించి భంగపడిన బొమ్మేర రామ్మూర్తిని సోమవారం హైదరాబాద్‌కు వెంటబెట్టుకొచ్చి కేటీఆర్‌తో సమావేశ పరిచారు. అనేక కారణాల వల్ల టికెట్ ఇవ్వలేకపోయినట్టు రామ్మూర్తికి కేటీఆర్ నచ్చజెప్పారు. మళ్లీ టీఆర్‌ఎస్ ప్రభుత్వమే వస్తుందని, అప్పుడు ప్రభుత్వంలో తప్పకుండా సముచిత స్థానం కల్పిస్తామని కేటీఆర్ హామీనట్టు రామ్మూర్తి మీడియాకు తెలిపారు. పార్టీ ప్రకటించిన అభ్యర్థి విజయానికి తనవంతుగా కృషి చేస్తానని స్పష్టం చేసినట్టు ఆయన తెలిపారు