రాష్ట్రీయం

తెలంగాణలో బంద్ విజయవంతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 10: పెట్రోలు, డీజీలు ధరల పెరుగుదలకు వ్యతిరేకంగా ఏఐసీసీ ఇచ్చిన భారత్ బంద్ సోమవారం తెలంగాణలో విజయవంతమైంది. కాంగ్రెస్ సారధ్యంలో జరిగిన బంద్‌కు టీడీపీ, వామపక్షాలు మద్దతు ప్రకటించాయి. నాయకులు, కార్యకర్తలు ఉదయమే పార్టీ జెండాలు చేబూని రోడ్లపైకి వచ్చారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. బైక్ ర్యాలీలు నిర్వహిస్తూ దుకాణాలను మూయించారు. విద్యా సంస్థలు బంద్ పాటించాయి. ముందు జాగ్రత్తగా నాయకులను, కార్యకర్తలను పోలీసులు ఎక్కడికక్కడ అరెస్టు చేశారు. సమీప పోలీసు స్టేషన్లకు తరలించారు.
వీహెచ్, వినోద్, రమణ అరెస్టు
బషీర్‌బాగ్ చౌరస్తా వద్ద ఏఐసీసీ కార్యదర్శి, మాజీ ఎంపీ వి. హనుమంత రావును పోలీసులు అరెస్టు చేసి కంచన్‌బాగ్ పోలీసు స్టేషన్‌కు తరలించారు. టీ.పీసీసీ ప్రధాన కార్యదర్శి ఎంఆర్‌జీ వినోద్ రెడ్డి నేతృత్వంలో
కార్యకర్తలు హిమాయత్‌నగర్‌లో బైక్ ర్యాలీ చేపట్టగానే పోలీసులు అరెస్టు చేసి నారాయణగూడ పోలీసు స్టేషన్‌కు తరలించారు. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా కార్యకర్తలు బంద్‌లో పాల్గొన్నారు. తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ నాయకత్వంలో పార్టీ కార్యకర్తలు ఇందిరా పార్కు నుంచి ఆర్టీసీ క్రాస్ రోడ్డు వరకూ ర్యాలీగా వెళ్ళారు. అక్కడ బైఠాయించడంతో ట్రాఫిక్ నిలిచి పోయింది. దీంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి వారిని అరెస్టు చేసి చిక్కడపల్లి ప ఓలీసు స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా రమణ మాట్లాడుతూ శాంతియుతంగా చేపట్టిన నిరసన కార్యక్రమాన్ని పోలీసులు అడ్డుకున్నారని, అరెస్టులతో ఉద్యమాన్ని అడ్డుకోలేరని అన్నారు.

చిత్రం..భారత్ బంద్ సందర్భంగా హైదరాబాద్‌లో ఆందోళనకు దిగిన వీహెచ్‌ని అదుపులోకి తీసుకుంటున్న పోలీసులు