రాష్ట్రీయం

మోదీ ప్రసంగాలపై తెలుగు సంపుటి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 10: భారత ప్రధాని నరేంద్రమోదీ విద్యార్థులను ఉద్ధేశించి చేసిన ప్రసంగాల సంపుటి ‘పరీక్షల యోధులు’ తెలుగు అనువాదాన్ని కేంద్ర మానవ వనరుల మంత్రి ప్రకాష్ జవదేకర్ ఆవిష్కరించనున్నారు. పరీక్షల సందర్భంగా విద్యార్థుల్లో ఆందోళనలు, భయాన్ని తొలగించడం, ఒత్తిడి గురికాకుండా చూడటం, చదువును ఆహ్లాదంగా తీసుకోవడం, చాలా సంతోషంగా పరీక్షలకు హాజరుకావడం కోసం సరికొత్త వాతావరణాన్ని విద్యార్థులకు కల్పించే యోచనతో భారత ప్రధాని గత ఏడాది పలు సందర్భాల్లోనూ, మన్‌కీ బాత్ సందర్భంలోనూ విద్యార్థులతో అనేక విషయాలు మాట్లాడారు.
ఒత్తిడి తగ్గించాలంటే పాఠ్యాంశాలు మొదలు అన్ని విషయాల్లో సంస్కరణలు జరగాలని, కొత్త విద్యాసంస్కరణలు అనివార్యమని ప్రధాని పేర్కొన్నారు. ఆ క్రమంలోనే మానవ వనరుల శాఖ అనేక సంస్కరణలను చేపట్టింది.
మంగళవారం మధ్యాహ్నం రవీంద్రభారతిలో జరిగే ఈ కార్యక్రమంలో కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ, బీజేపీ నేతలు డాక్టర్ కే లక్ష్మణ్, కిషన్‌రెడ్డి, సి రామచంద్రారెడ్డి, ఎన్వీఎస్‌ఎస్ ప్రభాకర్, ఎన్ రామచందర్‌రావులతో పాటు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ టి విజయకుమార్, విద్యావేత్త బీవీ పట్ట్భారాం, చుక్కారామయ్య, సీనియర్ పాత్రికేయులు కే రామచంద్రమూర్తి, విద్యావేత్త గీతా కరణ్ తదితరులు పాల్గొంటారు.