క్రైమ్/లీగల్

ఎప్పటిలోగా పూర్తిచేస్తారు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: బాబ్రీ మసీదు కూల్చివేత కేసు విచారణను నిర్ణీత సమయంలోగా ఎలా పూర్తి చేస్తారో తెలియజేయాల్సిందిగా సుప్రీం కోర్టు సోమవారంనాడు సంబంధిత జిల్లా కోర్టు న్యాయమూర్తిని ఆదేశించింది. ఇందుకు సంబంధించి నివేదికను సీల్డ్ కవర్‌లో అందజేయాలని సూచించింది. ఈ కేసు విచారణను 2019 ఏప్రిల్ లోగా పూర్తి చేయాలని గతంలో సుప్రీం కోర్టు డెడ్‌లైన్ విధించింది. ఈ కేసులో బీజేపీకి చెందిన సీనియర్ ప్రముఖులు ఎల్‌కే అద్వానీ, మురళీ మనోహర్ జోషీ, ఉమా భారతి వంటి వారిని దోషులుగా పేర్కొన్న సంగతి తెలిసిందే. కాగా కేసు విచారిస్తున్న క్రింది కోర్టు న్యాయమూర్తి ఎస్‌కే యాదవ్ విజ్ఞప్తి మేరకు జస్టిస్ ఆర్‌ఎఫ్ నారిమన్, జస్టిస్ ఇందు మల్హోత్రాలతో కూడిన సుప్రీం ధర్మాసనం ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి సైతం నోటీసులు జారీ చేసింది. జిల్లా కోర్టు న్యాయమూర్తి ఎస్‌కే యాదవ్‌కు ప్రమోషన్ పెండింగ్‌లో ఉండటంతో ఆయన ఈ విషయంలో సుప్రీం ధర్మాసనం సూచనలను కోరారు. బాబ్రీ మసీదు కూల్చివేత ఘటనపై విచారణ పూర్తయ్యే వరకు జిల్లా కోర్టు న్యాయమూర్తి పదోన్నతిని అమలు చేయరాదంటూ అలహాబాద్ హైకోర్టు స్టే విధించిన నేపధ్యంలో ఆయన ఈ విషయంపై సుప్రీం కోర్టును ఆశ్రయించడం జరిగింది. 1992 డిసెంబర్ 6న జరిగిన బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితులు అద్వానీ, జోషి, ఉమలను విచారించి రెండేళ్లలో (2019 ఏప్రిల్ 19 నాటికి) కేసు విచారణను పూర్తి చేయాలని, ఇందుకోసం ప్రతిరోజూ ట్రయల్‌ను నిర్వహించాలని అత్యున్నత న్యాయస్థానం గత యేడాది జిల్లా కోర్టును ఆదేశించడం జరిగింది. కరసేవ ఉద్యమాన్ని ఓ కుట్రగా పేర్కొంటూ ఇది లౌకికవాదానికే ముప్పుగా పేర్కొంటూ ఈ విషయంలో నిందితులుగా ఉన్న వీవీఐపీలను విచారించి నిగ్గుదేల్చాల్సిందిగా సీబీఐని ఆదేశించిన సంగతి తెలిసిందే. సెషన్స్ కోర్టు ఈ విషయంలో నిర్ణీత తేదీలోగా విచారణ ముగించలేమని అభిప్రాయపడితే తప్ప ఈ కేసు విచారణను ఎంతమాత్రం ఆపకూడదని, సంబంధిత న్యాయమూర్తిని సైతం బదిలీ, లేదాప్రమోషన్‌పై పంపరాదని ఆప్పట్లో ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది. అద్వానీ, జోషి, ఉమలతోబాటు ఈ కుట్ర కేసులో వినయ్‌కుమార్, సాధ్వి రితంబర, విష్ణుహరి దాల్మియా వంటి పలువురు అభియోగాలను ఎదుర్కొంటున్నారు. రాయ్‌బరేలీలోని ప్రత్యేక న్యాయస్థానంలో ఈ వ్యవహారంపై నేతల ప్రమేయంపై మొత్తం రెండు సెట్ల కేసులు నమోదుకాగా, రెండవ సెట్ కేసులు కరసేవకులపై నమోదయ్యాయి. ఈ కేసు ట్రయల్స్ తర్వాత లక్నో కోర్టులో నడిచాయి. కాగా ఈ కుట్ర కేసులో నిందితులుగా సీబీఐ విచారణను ఎదుర్కొంటున్న 21మందిలో ఎనిమిది మంది మరణించారు. ఇందులో శివసేన చీఫ్ బాల్‌థాకరే, విహెపీ నేత ఆచార్య గిరిరాజ్ కిశోర్ ఉన్నారు.