తెలంగాణ

‘డీఎస్’ పునరాగమనం కాంగ్రెస్‌లో అడ్డెవరికో..?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిజామాబాద్, సెప్టెంబర్ 10: రాష్ట్ర రాజకీయాల్లో సుదీర్ఘ అనుభవం కలిగి ఉండి, సీనియర్ నేతగా చెలామణి అవుతున్న రాజ్యసభ సభ్యుడు డీ.శ్రీనివాస్ తిరిగి తన సొంత గూటిలో చేరనున్నారనే ప్రచారం పలువురు కాంగ్రెస్ శ్రేణులను కలవరపాటుకు గురి చేస్తోంది. ప్రధానంగా నిజామాబాద్ అర్బన్, రూరల్ అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన నాయకులు ఈ విషయమై ఆసక్తికరంగా చర్చించుకుంటూ, తాజా పరిణామాలను ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు ఎంతో ఉత్కంఠతను ప్రదర్శిస్తున్నారు. డీఎస్ కాంగ్రెస్‌లో మళ్లీ చేరితే, పై రెండు సెగ్మెంట్లలోనూ రాజకీయ సమీకరణల్లో అనూహ్య మార్పులు చోటుచేసుకునే అవకాశాలుండడమే స్థానిక నేతల కలవరపాటుకు కారణంగా నిలుస్తోంది. ఇప్పటికే డీఎస్‌పై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని కోరుతూ ఉమ్మడి జిల్లాకు చెందిన తెరాస ప్రజాప్రతినిధులంతా మూకుమ్మడిగా అధిష్టానానికి తీర్మానం లేఖను అందించగా, ఈ విషయమై అధినేత కేసీఆర్ కూడా నాన్చుడు ధోరణిని అవలంబిస్తూ డీఎస్‌ను ఏకాకిని చేసిన దరిమిలా, ఆయన గులాబీ గూటిని వీడడం దాదాపు ఖాయమైందనే చెప్పాలి. గత వారం రోజుల క్రితం మీడియా సమావేశంలో డీఎస్ కూడా దమ్ముంటే తనను సస్పెండ్ చేయాలంటూ తెరాస అధిష్ఠానానికి అల్టిమేటం ఇవ్వడం ద్వారా ఆ పార్టీని వీడనున్నట్టు సంకేతాలు అందించారు. అంతేకాకుండా తాను కాంగ్రెస్‌ను వీడాల్సి వస్తుందని ఎన్నడూ అనుకోలేదని, ఏఐసీసీలోని ఒకరిద్దరు నాయకుల తీరు వల్ల తాను కాంగ్రెస్ నుండి బయటకు రావాల్సి వచ్చిందని పనిలోపనిగా పేర్కొనడాన్ని బట్టి తిరిగి ఆయన సొంత గూటికి చేరువయ్యే ఆలోచనలు చేస్తున్నారని పరిశీలకులు విశే్లషిస్తున్నారు.
ఈ ప్రచారానికి ఊతమందించేలా డీఎస్ సైతం గత నాలుగైదు రోజుల నుండి ఢిల్లీలోనే మకాం వేసి కాంగ్రెస్ ముఖ్య నేతలతో మంతనాలు జరుపుతున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో డీఎస్ ప్రయత్నాలు ఫలించి తిరిగి ఆయన కాంగ్రెస్‌లో చేరితే తమ పరిస్థితి ఏమిటోనని అర్బన్, రూరల్ సెగ్మెంట్‌లకు చెందిన పలువురు కాంగ్రెస్ నాయకులు లోలోపల అంతర్మథనం చెందుతున్నారు.
డీఎస్‌తో పాటు ఎమ్మెల్సీ డాక్టర్ భూపతిరెడ్డిని కూడా పార్టీ నుండి బహిష్కరించాలని జిల్లా ప్రజాప్రతినిధులు కోరిన దరిమిలా, ఆయన కూడా తెరాసను వీడి డీఎస్ వెంట కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్నారనే ప్రచారం జరుగుతోంది. ఏఐసీసీ ముఖ్య నేతలతో డీఎస్‌కు ఉన్న సాన్నిహిత్యం దృష్ట్యా ఆయన కోరిన మేరకు అభ్యర్థిత్వాలు ఖరారు చేయడం కష్టమేమీ కాదని మెజార్టీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఈ ప్రచారంతో పై రెండు సెగ్మెంట్లపై గంపెడాశలు పెట్టుకున్న ఆశావహులు తీవ్ర కలవరానికి గురవుతున్నారు. ముఖ్యంగా అర్బన్ సెగ్మెంట్ నుండి టీ.పీసీసీ అధికార ప్రతినిధి మహేష్‌కుమార్ గౌడ్, కార్యదర్శి రత్నాకర్, డీసీసీ అధ్యక్షుడు తాహెర్‌బిన్ హందాన్‌లు కాంగ్రెస్ టిక్కెట్‌ను ఆశిస్తూ ఎవరికివారు లాబీయింగ్ యత్నాల్లో నిమగ్నమై ఉన్నారు.