తెలంగాణ

ధరలు పెంచి నడ్డి విరుస్తున్న కేంద్రం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జనగామ టౌన్, సెప్టెంబర్ 10: కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డిజీల్ ధరలు పెంచుతూ ప్రజల నడ్డి విరుస్తుండగా, పెంచిన ధరలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పరోక్షంగా మద్దతు తెలుపుతూ ప్రజల జీవితాలతో చెలగాటం ఆడుతున్నాయని టీపీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య విమర్శించారు. పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించాలని అఖిలపక్షం ఆధ్వర్యంలో నిర్వహించిన భారత్ బంద్ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం జనగామలో కాంగ్రెస్, టీడీపీ, సీపీఐతో పాటు పలు విద్యార్థి సంఘాలు నిరసన ర్యాలీలు చేపట్టారు. ఈ బంద్ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి టీపీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య సోమవారం తెల్లవారుజామునే జనగామ చేరుకొని అఖిలపక్ష పార్టీల, నాయకులతో జనగామ బస్‌డిపో ప్రధాన గేటువద్ద బైఠాయించి నిరసన తెలిపారు. బస్సులను బయటకు వెళ్లనివ్వకుండా అడ్డుకున్నారు. పోలీసులు వారిని పోలీసు స్టేషన్ తరలించి మధ్యాహ్నం విడుదల చేశారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య మీడియాతో మాట్లాడుతూ ఒకే దేశం.. ఒకే ప్రజా.. ఒకే పన్ను అదే జీఎస్‌టీ విధానంను ఊదరకొట్టి ప్రచారం చేసిన కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డిజిల్ ధరలను జీఎస్‌టీ పరిధిలోకి ఎందుకు తీసుకరాలేకపోయిందని ప్రశ్నించారు. రోజువారి ధరల మదింపు విధానం అమలుచేస్తుండడంతో పెట్రోల్, డీజిల్ ధరలు రోజురోజుకు మండిపడుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.
గతంలో పెట్రోల్ ధర అంతర్జాతీయ మార్కెట్ క్రూడాయిల్ ధర 120డాలర్లు ఉన్నప్పుడు రూ.68, రూ.53గా ఉన్న పెట్రోల్, డిజిల్ ధరలను, ప్రస్తుతం బ్యారెల్ ధర 69.02 డాలర్లకు తగ్గినప్పటికీ రూ.83.25, రూ.78.39లుగా ఎందుకు ధరలు పెంచాల్సి వచ్చిందో ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కేవలం పెట్రోల్ కంపెనీల లాభాల కోసం కేంద్ర ప్రభుత్వం క్రూడాయిల్ ధరలకు అనుగుణంగా ఆధరలు తగ్గించకుండా ప్రజలపై భారం మోపుతుందని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం ధరలు పెంచుతూ ఉంటే తెలంగాణ ప్రభుత్వం తగ్గించాలని డిమాండ్ చేయకుండా చూస్తూ ఊర్కోవడంలో అంతర్యమేమిటని ప్రశ్నించారు. ప్రపంచ వ్యాప్తంగా చమురు ధరలు తగ్గినప్పటికీ దేశంలో మొదటి సారిగా అత్యధికంగా ధరలు పెంచి ప్రజలపై భారాన్ని మోపుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. గృహ అవసరాలకు వాడుకునే వంటగ్యాస్ ధరలు రెండింతలు పెంచిందదన్నారు. కేంద్ర ప్రభుత్వం పెంచుతున్న ధరలపై విధించే పన్నులను తగ్గించే అవకాశం రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నప్పటికీ రాష్ట్ర అపదర్మ ముఖ్యమంత్రి ఆ దిశగా ఆలోచించలేదని విమర్శించారు. 22రాష్ట్రాల కంటే పెట్రోల్‌పై అధిక పన్ను విధిస్తున్న రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని అన్నారు. ఇప్పటికైనా పెంచిన ధరలను తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. అదే విధంగా అధికంగా విధిస్తున్న పన్నులను తగ్గించాలని మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ప్రజలు గుణపాఠం చెబుతారని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ జిల్లా అధ్యక్షుడు బొట్ల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

చిత్రం..విలేఖరులతో మాట్లాడుతున్న టీపీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య