తెలంగాణ

గెలుపు గుర్రాలను బరిలోకి దింపుతాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబ్‌నగర్: గెలుపు గుర్రాలనే ఎన్నికల బరిలో దింపుతామని, తెలంగాణలో జరిగే ఎన్నికలను జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా, ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రత్యేకంగా దృష్టి పెట్టారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్ అన్నారు. ఈనెల 15న నిర్వహించే బహిరంగ సభ ఏర్పాట్లను లక్ష్మణ్ పరిశీలించారు. ఈ సందర్భంగా సోమవారం మహబూబ్‌నగర్‌లోని బీజేపీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో లక్ష్మణ్ మాట్లాడుతూ తెలంగాణ ప్రజలు కేసీఆర్‌కు ఐదేళ్ల పాటు అధికారం ఇస్తే ప్రజల ఆశలను గండికొట్టి ప్రజా తీర్పును అవమానపరిచి ముందస్తు ఎన్నికలకు వెళ్లిన కేసీఆర్‌కు తగిన మూల్యం తప్పదని హెచ్చరించారు. బీజేపీ జాతీయ నాయకత్వం ఈ ఎన్నికలను చాలా సీరియస్‌గా తీసుకుందని గెలుపు గుర్రాలకే టికెట్లు ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. తెలంగాణలో బీజేపీ పాగా వేయడం తథ్యమని.. తమ అంచనాలు తమకు ఉన్నాయని తాము తెలంగాణలో అధికారరం చేజిక్కించుకునేందుకు గత ఏడాది నుండే పార్టీని బూత్‌స్థాయిలో బలోపేతం చేసుకున్నామని తెలిపారు. కర్ణాటక తరహలో కుమారస్వామి మాదిరే తాము కూడా అధికారంలోకి వస్తామని ముఖ్యమంత్రి పీఠంపై కూర్చుంటామని మజ్లిస్ నాయకులు అంటుంటే ప్రజలు ఆలోచనలో పడ్డారని అన్నారు. రాష్ట్రాన్ని ఎంఐఎం చేతిలో పెట్టడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. ఆ కుట్రలను బీజేపీ అడ్డుకుంటుందని ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు ప్రజలుస తగిన బుద్ది చెబుతారని హెచ్చరించారు. ముందస్తుకు వెళ్లిన కేసీఆర్‌కు భంగపాటు కావడం గ్యారంటీ అని అన్నారు. అసెంబ్లీని రద్దు ఎందుకు చేశారో ఇప్పటి వరకు చెప్పలేదని అందుకే టీఆర్‌ఎస్‌ను ప్రజలు తొక్కడం ఖాయమని అన్నారు. అసెంబ్లీని రద్దు చేసి రాష్ట్రంలో రాజకీయ అనిశ్చితికి కేసీఆర్ కారకుడయ్యారని ద్వజమెత్తారు. గత ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హమీలను నెరవేర్చలేక ప్రజల దృష్టిని మళ్లించి మరోసారి మోసం మాటలు చెప్పి అధికారంలోకి రావాలనే కేసీఆర్ కుట్రలను ప్రజలు అర్థం చేసుకున్నారని అన్నారు. కాంగ్రెస్‌ది కుంభకోణాల చరిత్ర, అవినీతికి మారుపేరు అని అలంటి పార్టీ తెలంగాణలో అధికారంలోకి వస్తే కేసీఆర్ తరహలోనే దోచుకోవడం దాచుకోవడమే తప్పా మరోకటి ఉండదని అన్నారు. ముఖ్యంగా చంద్రబాబునాయుడు దివంగత ఎన్టీఆర్ ఆత్మక్షోభించే విధంగా నిర్ణయాలు తీసుకుంటున్నారని కాంగ్రెస్‌తో టీడీపీ దోస్తి కడితే ఎన్టీఆర్ ఆత్మక్షోభించడం ఖాయమని అన్నారు. ఈ ఎన్నికలకు బీజేపీ అన్ని విధాలుగా సన్నదం అయిందని ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తరువాతే బీజేపీ అభ్యర్థులను ప్రకటించడం జరుగుతుందని తెలిపారు. ఈ నెల 15వ తేదీన పాలమూరులో జరిగే బీజేపీ ఎన్నికల శంఖారావం సభకు జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా రానున్నారని తెలిపారు. ఈ సభ ద్వారా బీజేపీ సత్తా ఎమిటో అందరికి అర్థం అవుతుందని అన్నారు. విలేఖరుల సమావేశంలో బీజేపీ రాష్ట్ర కోశాధికారి శాంతికుమార్, ఉపాధ్యక్షుడు కాసం వెంకటేశ్వర్లు, ప్రధాన కార్యదర్శి ఆచారి, జిల్లా అధ్యక్షురాలు పద్మజారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
చిత్రం..మహబూబ్‌నగర్‌లో విలేఖరుల సమావేశంలో మాట్లాడుతున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్