తెలంగాణ

టికెట్ ఇవ్వకున్నా టీఆర్‌ఎస్‌లోనే ఉంటా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 10: తనకు టికెట్ ఇవ్వకపోయినా టీఆర్‌ఎస్‌లోనే కొనసాగుతానని టీఆర్‌ఎస్ తాజా నేత, మాజీ మంత్రి దానం నాగేందర్ స్పష్టం చేసారు. తాను ఎలాంటి పదవులు ఆశించకుండా బేషరతుగానే టీఆర్‌ఎస్‌లో చేరానన్నారు. టీఆర్‌ఎస్ ప్రకటించిన అభ్యర్థుల జాబితాలో దానంకు టికెట్ దక్కకపోవడంతో ఆయన తిరిగి కాంగ్రెస్‌లో చేరుతారని జరగుతోన్న ప్రచారం నేపథ్యంలో సోమవారం మీడియాతో మాట్లాడారు. పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డిని తాను ఓ హోటల్లో కలిసినట్టు జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని ఖండించారు. తాను ఇప్పటికే ఐదుసార్లు ఎమ్మెల్యేగా పని చేయడం వల్ల ఆ పదవిపై ఆసక్తి కూడా లేదన్నారు. కాంగ్రెస్ పార్టీలో సీనియర్ బీసీ నాయకులు హనుమంతరావు, పొన్నాల లక్ష్మయ్య పరిస్థితి ఏమిటో చూసాక కూడా ఎవరైనా ఆ పార్టీలోకి తిరిగి వెళ్తారా? అని దానం ప్రశ్నించారు. కాంగ్రెస్ నుంచి పోటీ చేయడానికి అభ్యర్థులు దొరకని పరిస్థితి ఉందని విమర్శించారు. టీఆర్‌ఎస్‌లో కోటరీలు ఉన్నాయనేది తప్పన్నారు. వచ్చే ఎన్నికలకు తనకు టికెట్ ఇచ్చినా, ఇవ్వకపోయినా టీఆర్‌ఎస్‌ను వదిలిపెట్టే ప్రసక్తేలేదన్నారు. తరచూ పార్టీలు మారడానికి తానేమి గంగిరెద్దును కాదన్నారు.