రాష్ట్రీయం

దేశ ప్రయోజనాల పరిరక్షణ దిశగా భారత్-అమెరికా సంబంధాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, సెప్టెంబర్ 10: గతంతో పోలిస్తే మెరుగైన స్థితిలో దేశ ప్రయోజనాలు పరిరక్షించే విధంగా భారత్ - అమెరికా సంబంధాలు బలోపేతమవుతున్నాయని భారత మాజీ రాయబారి అశోక్ సజ్జనార్ అన్నారు. భారత ప్రభుత్వ విదేశీ మంత్రిత్వ శాఖ గీతం డీమ్డ్ యూనివర్శిటీలో సోమవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ దేశాధినేతలు మారుతున్నప్పటికీ భారత్ - అమెరికా సంబంధాలపై ఏ విధమైన ప్రభావం లేదన్నారు. ఒకప్పుడు ఖజకిస్తాన్, స్వీడన్, లాటినా దేశాల్లో భారత రాయబారిగా పనిచేసిన సజ్జనార్ పలు అంశాలను ప్రస్తావించారు.
భారత్‌కు కలిసే విస్తృత ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుంటే అమెరికాతో సంబంధాలు అన్నివిధాలా అవసరమన్నారు. చైనా ఆధిపత్యం కారణంగా ఎదురయ్యే సమస్యలను పరిష్కరించుకోవడం భారత్, అమెరికా దేశాలకు సవాలు వంటిదేనన్నారు. ఇండియా-పసిఫిక్ ప్రాంతంలో నెలకొనే ఈ సంబంధాల ద్వారా చైనాను నిలువరించడం సాధ్యమవుతుందన్నారు. భారత్ - అమెరికా సంబంధాల విషయంలో అక్కడ నివసిస్తున్న భారత సంతతిపై గణనీయమైన ప్రభావాన్ని చూపుతోందని ఆయన అభిప్రాయపడ్డారు. ఇప్పటి వరకూ స్ట్రేటజిక్ ట్రేడ్ ఆథరైజేషన్ (ఎస్‌టీవీ) 2 కేటగిరీలో ఉన్న భారత్‌ను ఎస్‌టీఎ-1 కేటగిరీలో చేర్చడం ద్వారా సాంకేతిక పరిజ్ఞానాన్ని ద్విముఖ ప్రయోజనాలకు భారత్ వాడుకునే అవకాశాన్ని అమెరికా కల్పించిందన్నారు. దీనివల్ల రక్షణ వాణిజ్యం సులభతరం కాగలదని, అలాగే పాకిస్తాన్ విషయంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన ప్రకటన కూడా భారత్‌కు అనుకూలించేదిగా ఉందన్నారు.
రానున్న కాలంలో భారత్ - అమెరికా సంబంధాలు మరింత మెరుగవుతాయని అభిప్రాయపడ్డారు. ప్రపంచంలో భారత్ అగ్రరాజ్యంగా ఎదిగేందుకు ఈ సంబంధాలు ఉపకరిస్తాయన్నారు. కార్యక్రమానికి గీతం వైస్‌ఛాన్స్‌లర్ ప్రొఫెసర్ ఎంఎస్ ప్రసాదరావుఅధ్యక్షత వహించగా స్కూల్ ఆఫ్ ఇంటర్నేషనల్ బిజినెస్ ఇన్‌ఛార్జి డైరెక్టర్ ప్రొఫెసర్ కేకే నారయణన్, తదితరులు పాల్గొన్నారు.

చిత్రం..మాజీ రాయబారి అశోక్ సజ్జనార్‌ను సత్కరిస్తున్న గీతం వైస్‌చాన్సలర్ ప్రొఫెసర్ ఎంఎస్ ప్రసాదరావు