ఆంధ్రప్రదేశ్‌

పెండింగ్‌లో 41 ఐటీఐల ప్రతిపాదనలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, సెప్టెంబర్ 10: రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో ప్రభుత్వ ఐటీఐల ఏర్పాటుకు వివిధ వర్గాల నుంచి 41 ప్రతిపాదనలు రాగా ఆర్థిక భారాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రస్తుతానికి పెండింగ్‌లో ఉంచాల్సి వచ్చిందని అందులో కృష్ణాజిల్లా పామర్రు కూడా ఒకటని రాష్ట్ర కార్మిక, ఉపాధి కల్పన శాఖ మంత్రి పితాని సత్యనారాయణ అన్నారు. శాసనసభ ప్రశ్నోత్తరాల్లో ఉప్పులేటి కల్పన అడిగిన ఓ ప్రశ్నకు సమాధానంగా మంత్రి పై విధంగా చెప్పారు. బీజేపీ సభ్యులు మాణిక్యాలరావు మాట్లాడుతూ తాడేపల్లిగూడెంలో ఐటీఐ ఏర్పాటుకు సీఎం చంద్రబాబు స్వయంగా 2017లోనే హామీ నిచ్చినా నెరవేరలేదనగా మంత్రి యనమల కల్పించుకుంటూ కేంద్ర నుంచి రావాల్సినవి తీసుకురండి ఆ తర్వాత చూద్దామన్నారు. మాణిక్యాలరావు మాట్లాడుతూ దానికి సంబంధించిన ఫైల్‌ను క్షణాల్లో మంత్రి పితాని ఒకే చేస్తే ఆర్థిక మంత్రి తొక్కి పెట్టారని అన్నారు. కదిరి పాలిటెక్నిక్ కళాశాల సమస్యలపై ఎమ్మెల్యే చాంద్‌బాషా ప్రశ్నించారు. పలు ప్రాంతాల్లో శాశ్వత భవనాలు లేవని షెడ్లలో తరగతులు జరుగుతున్నాయని పలువురు ఫిర్యాదు చేశారు. మంత్రి పితాని మాట్లాడుతూ 29 కళాశాలలకు భవనాల నిర్మాణానికి ఇటీవల రూ. 120 కోట్లు మంజూరు చేసామన్నారు.