ఆంధ్రప్రదేశ్‌

ప్రకృతి సేద్యమే శ్రేయస్కరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, సెప్టెంబర్ 10: రాష్ట్రంలో ప్రాంతాల వారీగా వాతావరణ పరిస్థితులకు అనుకూలంగా ప్రత్యామ్నాయ పంటల దిశగా రైతాంగం సమాయత్తం కావాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పిలుపునిచ్చారు. రసాయన ఎరువుల వాడకం వల్ల పర్యావరణ సమతుల్యత దెబ్బతినటంతో పాటు అనారోగ్యానికి హేతువుగా మారుతున్న ప్రస్తుత తరుణంలో పెట్టుబడి ఖర్చులు తగ్గించుకుని ప్రకృతి వ్యవసాయాన్ని అవలంబించడం ద్వారా అధిక దిగుబడులు సాధించాలని ఆకాంక్షించారు. ఉండవల్లి ప్రజావేదిక హాల్‌లో గత రెండురోజులుగా జరుగుతున్న ప్రకృతి వ్యవసాయంపై అవగాహన కార్యక్రమం సోమవారం సాయంత్రంతో ముగిసింది. ముగింపు సభలో ప్రకృతి వ్యవసాయం ద్వారా అధికోత్పత్తులు సాధించిన రైతుల్ని ముఖ్యమంత్రి అభినందించారు. 2024 నాటికి 60 లక్షల మంది రైతులతో 80 లక్షల హెక్టార్లలో పైసా పెట్టుబడిలేని ప్రకృతి వ్యవసాయాన్ని విస్తరింప చేయటమే తమ ప్రభుత్వ ధ్యేయమన్నారు. ఈ ఏడాది పైసా పెట్టుబడిలేని ప్రకృతి సేద్యం సంవత్సరంగా తాను ప్రకటించానని, రైతులంతా ఈ నినాదాన్ని ఉత్సాహంతో ముందుకు తీసుకువెళ్లాలని కోరారు. ఐదు లక్షల మంది రైతులు ఐదు లక్షల ఎకరాల్లో ప్రకృతి సేద్యం చేపట్టటం వల్ల రాష్ట్రాన్ని ఐక్యరాజ్య సమితి గుర్తించిందని, వ్యవసాయం- సాంకేతికత అనే అంశంపై తాను త్వరలోనే ఐక్యరాజ్యసమితిలో కీలక ఉపన్యాసం చేయనున్నట్లు తెలిపారు. ఈ సమావేశానికి ముఖ్య మంత్రిగా కాకుండా టీమ్ లీడర్‌గా వెళుతున్నట్లు చెప్పారు. ఆంధ్రప్రదేశ్ ప్రకృతి రైతుల అనుభవసారాన్ని అక్కడ అంతర్జాతీయ వేదికపై నిపుణులు చెప్పే అంశాలను ఆధ్యయనం చేసి ఒక కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తామన్నారు. రాజధాని అమరావతికి నాగులైదు నెలల్లో ఒక రూపం వస్తుందన్నారు. మూడువేల గ్రామాల్లో మూడేళ్లలో ఐదులక్షల మంది కర్షకులు ప్రకృతి సేద్యాన్ని చేపట్టటం ఆషామాషీ కాదన్నారు. ఇది ఓ అపూర్వ విజయంగా అభివర్ణించారు. జేబీఎన్‌ఎఫ్‌తో ముందుకు సాగేందుకు ఐదువేల మంది కమ్యూనిటీ రిసోర్స్ పర్సన్లు తయారు కావాలన్నారు. ఒక్కో రిసోర్స్ పర్సన్ వందమంది రైతుల్ని జేబీఎన్‌ఎఫ్ రైతులుగా మార్చవచ్చన్నారు.
ప్రకృతి వ్యవసాయాన్ని ఉద్యమంలా కొనసాగిస్తున్న సుభాష్ పాలేకర్ మన రాష్ట్రంలో ప్రకృతి వ్యవసాయ రైతులకు కార్యశాలలు నిర్వహిస్తున్నారని, భవిష్యత్తులో కూడా ఇదే సహకారం అందించాలన్నారు. ఫ్రాన్స్ ప్రభుత్వం వచ్చే నవంబర్‌లో నిర్వహించే పారిస్ పీస్ ఫోరంలో ప్రకృతి సేద్యపు వినూత్న విధానాలను పరిచయం చేయాలని కోరిందని చెప్పారు. అనంతరం ప్రకృతి సేద్యం చేసే రైతుల్ని ముఖ్యమంత్రి అభినందించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయశాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, ముఖ్యమంత్రి అదనపు కార్యదర్శి అడుసుమల్లి వెంకట రాజవౌళి, వ్యవసాయశాఖ సలహాదారు విజయ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.