ఆంధ్రప్రదేశ్‌

రైతులకు అండగా ప్రభుత్వం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, సెప్టెంబర్ 10: ప్రభుత్వం రైతులకు అన్నివేళలా అండగా నిలుస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు భరోసా ఇచ్చారు. నీరు- ప్రగతి, వ్యవసాయంపై సోమవారం ఉన్నతాధికారులు, జిల్లా కలెక్టర్లతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ ఏడాది దిగుబడులు పెంచే దిశగా కార్యాచరణ రూపొందించాలని ఆదేశించారు. తెగుళ్ల నియంత్రణ పట్ల పూర్తి అప్రమత్తంగా వ్యవహరించాలి..రైతుల్లో అవగాహన కల్పించాలన్నారు. పత్తిలో గులాబీరంగు తెగులు నియంత్రణ కు చర్యలు చేపట్టాలన్నారు. వ్యవసాయ దిగుబడులు తగ్గకుండా జాగ్రత్తలు పాటించాలన్నారు. ఈ ఏడాది ఖరీఫ్ సీజన్‌లో సాధారణ సాగు విస్తీర్ణం 39.53 లక్షల హెక్టార్లకు గాను 31.59 లక్షల హెక్టార్లలో వివిధ పంటలు సాగుచేశారన్నారు. గత ఏడాది కంటే అధికంగా కౌలురైతులకు రుణాలు అందించి పెట్టుబడికి ఇబ్బందిలేకుండా చూడాలని ఆదేశించారు. ఈ ఏడాది అన్ని రిజర్వాయర్లలో 68 శాతం పైగా నీరు నిండిన నేపథ్యంలో పంట దిగుబడులు గతంలో కంటే పెరిగేలా శ్రద్ధ చూపాలన్నారు. ప్రజా జీవితంతో ఆడుకునే హక్కు ఎవరికీలేదు.. ప్రజారోగ్యం కాపాడటం అందరి కర్తవ్యమన్నారు. సంజాయిషీలు, వివరణలు ఇకపై వినేదిలేదని స్పష్టంచేశారు. ప్రతిచోట పారిశుద్ధ్యం మెరుగుపడాలన్నారు. కమిషనర్లు, శానిటేషన్ సిబ్బంది పొద్దునే్న వార్డులలో పర్యటించాలని ఆదేశించారు. అంతా బాగా పనిచేస్తేనే ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది. ఏ ఒక్కరు నిర్లక్ష్యంగా వ్యవహరించినా చెడ్డపేరు వస్తుందని స్పష్టంచేశారు. విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం, కడప, అనంతపురంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. వైద్యశాఖ, మునిసిపల్, పంచాయతీరాజ్‌శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ప్రజారోగ్య పరిరక్షణ అందరి కర్తవ్యంగా చెప్పారు. తెలిసీ తప్పుచేస్తే సహించేది లేదని మరోసారి హెచ్చరించారు. టెలీకాన్ఫరెన్స్‌లో ప్రభుత్వ ప్రధానకార్యదర్శి దినేష్‌కుమార్, వివిధ జిల్లాల కలెక్టర్లు, ఆయాశాఖల ఉన్నతాధికారులు రాజశేఖర్, అహ్మద్‌బాబు, కన్నబాబు, పూనం మాలకొండయ్య, రామాంజ నేయులు తదితరులు పాల్గొన్నారు.