ఆంధ్రప్రదేశ్‌

కర్మాగారాల్లో లోపాలుంటే క్షమించం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ(సిటీ), సెప్టెంబర్ 10: కర్మాగారాల్లో భద్రతా ప్రమాణాలు తప్పనిసరిగా పాటించాలని, ఏవైనా లోపాలుంటే సమీక్షించుకుని సరిదిద్దుకోవాలని రాష్ట్ర కార్మికశాఖ మంత్రి పితాని సత్యనారాయణ సూచించారు. లోపాలుంటే మాత్రం క్షేమించే ప్రసక్తే లేదన్నారు. అలాంటివాటిపై తక్షణం చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
వెలగపూడి సచివాలయంలో తన కార్యాలయంలో సోమవారం మంత్రి పితాని సత్యనారాయణ రాష్ట్రంలోని 13 జిల్లాల ఇన్‌స్పెక్టర్స్ ఆఫ్ ఫ్యాక్టరీస్‌లతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కర్మాగారాల్లో భద్రత ప్రమాణాల దృష్ట్యా రాజీపడే ప్రసక్తేలేదని, అధికారులు తనిఖీలు సక్రమంగా నిర్వహించాలన్నారు. ఆధునిక యుగంలో అధికారులు ఎప్పటికప్పుడు సాంకేతికపరంగా అప్‌గ్రేడ్ కావాలన్నారు. దానికి సంబంధించిన కార్మికుల నైపుణ్యాభివృద్ధి కోసం ఎప్పటికప్పుడు శిక్షణ తరగతులు నిర్వహించాలన్నారు. భద్రత ప్రమాణాల దృష్ట్యా కార్మికులను చైతన్య వంతులను చేసే బాధ్యత అధికారులదేనన్నారు. కర్మాగారాల్లో పాతబడిన మెషినరీ ఏమైన ఉంటే వెంటనే వాటి మార్పునకు అధికారులు ఆదేశాలు జారీ చేయాలన్నారు. థర్డ్ పార్టీ ఏజెన్సీలు కర్మాగారాల్లో భద్రత పరమైన తనిఖీల బాధ్యత సక్రమంగా నిర్వహిస్తున్నారో లేదో అధికారులు పర్యవేక్షించాలన్నారు. కార్మికుల భద్రత, సంక్షేమమే లక్ష్యంగా టీడీపీ ప్రభుత్వం పని చేస్తోందన్న ఇందులో రాజీపడే ప్రసక్తే లేదన్నారు. ఈ సమీక్షా సమావేశంలో కార్మికశాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి జేఎస్వీ ప్రసాద్, డైరెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ జి బాలకిషోర్‌తో పాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.