ఆంధ్రప్రదేశ్‌

సబ్‌మెరైన్ మ్యూజియం ఏర్పాటుకు అధ్యయనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, సెప్టెంబర్ 10: విశాఖపట్నంలో సబ్‌మెరైన్ హెరిటేజ్ మ్యూజియం స్థాపన అవకాశాలపై ఆధ్యయనం చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆదేశించారు. సోమవారం శాసనసభ ప్రాంగణంలోని ముఖ్యమంత్రి చాంబర్‌లో తూర్పు నావికాదళ అధికారులు సీఎంతో భేటీ అయ్యారు. పర్యాటక అభివృద్ధిపై వీరితో ముఖ్యమంత్రి చర్చించారు. వీటిపై నివేదిక సమర్పించాలని పర్యాటకశాఖ అధికారులను ఆదేశించారు. విశాఖ హార్బర్, డాక్ యార్డ్‌లో కాలుష్య నియంత్రణకు చర్యలు చేపట్టాలని సీఎం సూచించారు. నగరంలో మురుగునీరు సముద్రంలో కలవకముందే ట్రీట్‌మెంట్ ప్లాంట్ ఏర్పాటుచేసి శుద్ధి చేసేందుకు చర్యలు తీసుకోవాలని నావికాదళ అధికారులు ముఖ్యమంత్రిని కోరారు. ఐఎన్‌ఎస్ కళింగ కోసం భీమిలి వద్ద భూములు కొనుగోలుకు సిద్ధంగా ఉన్నామని, ధర తగ్గించేందుకు చొరవ చూపాలన్నారు. విజయనగరంలో భూమి కేటాయిస్తే నేవల్ ఆర్మ్‌మెంట్ డిపో ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. దీనిపై సీఎం స్పందిస్తూ రాంబిల్లి దగ్గర ప్రత్యామ్నాయం చూసుకోవాలని సూచించారు. ఆపరేషన్ ప్రాజెక్ట్‌కు ఇప్పటికే రూ 122 కోట్లు కేటాయించామని, భూము ఇచ్చిన వారికి పునరావాసం, పరిహారం చెల్లింపును వేగవంతం చేయాలని జిల్లా యంత్రాంగాన్ని ముఖ్యమంత్రి ఆదేశించారు. కొందరు డాక్‌యార్డ్ కార్మికులు ఓవర్‌టైం అలవెన్సుల కోసం ఆందోళన చేస్తున్నారని, వారిది జాతీయ ప్రాజెక్టు అయినందున శాసనసభలో తీర్మానంచేసి కేంద్రానికి పంపుతామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. నేవీ, రాష్ట్ర పర్యాటక విభాగం పర్యాటక అభివృద్ధి ప్రాజెక్టుకు రూపకల్పన చేయాలన్నారు. ప్రభుత్వం ముందుకొస్తే తాము సహకారం అందిస్తామని ఫ్లాగ్ ఆఫ్ కమాండ్ ఇన్‌చార్జి వైస్ అడ్మిరల్ కరంబీర్‌సింగ్ సంసిద్ధత వ్యక్తంచేశారు.