రాష్ట్రీయం

కాంగ్రెస్‌కు పట్టం కట్టడానికి ప్రజలు సిద్ధం: రోశయ్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, సెప్టెంబర్ 10: కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని, దానిని సాధించుకోవడానికి కష్టపడాలని పార్టీ నేతలకు మాజీ సీఎం కొణిజేటి రోశయ్య సూచించారు. వివిధ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు విజయవాడ వచ్చిన ఆయన పార్టీ ఆహ్వానం మేరకు పీసీసీ రాష్ట్ర కార్యాలయాన్ని సోమవారం సాయంత్రం సందర్శించారు. ఈ సందర్భంగా పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి, పీసీసీ సీనియర్ నేతలు ఆయనను సాదరంగా ఆహ్వానించి, ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా మీడియాతో రోశయ్య మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి రాలేదన్నారు. ఈ రోజు రఘువీరారెడ్డి కోరిక మేరకు ఆంధ్రరత్నభవన్‌కి వచ్చానన్నారు.
టీడీపీ సర్పంచ్ కాంగ్రెస్‌లో చేరిక
తూర్పుగోదావరి జిల్లా ముమ్ముడివరానికి చెందిన గంగిశెట్టి గంగాధర్ ఆధ్వర్యంలో సుంకర పాలెం సర్పంచ్ శ్రీనివాస్ కిరణ్‌తో పాటు దాదాపు 50 మంది కాంగ్రెస్ పార్టీలో చేరారు. వీరికి పీసీసీ అధ్యక్షుడు డాక్టర్ ఎన్ రఘువీరారెడ్డి పార్టీ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీలో చేరిన వారిలో బొంత శ్రీనివాస్, బొంత సత్యనారాయణ, వాసశెట్టి సత్యనారాయణ, కే సత్యనారాయణ, వీరాబాబు, మగాపు గంగధర్, ఎడిద సూరిబాబు, గాడిబాబూరావు తదితరులు ఉన్నారు.