ఆంధ్రప్రదేశ్‌

ఉద్దానంలో వైద్యుల కొరత లేదు: సీఎం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, సెప్టెంబర్ 10: శ్రీకాకుళం జిల్లా ఉద్దానంలో కిడ్నీ వ్యాధిగ్రస్తులకు అవసరమైన వైద్యసేవలు క్రమం తప్పకుండా అందిస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వివరణ ఇచ్చారు. క్రమం తప్పకుండా డయాలసిస్ నిర్వహిస్తున్నారని, అన్నిరకాల చర్యలతో రోగుల సంఖ్య తగ్గుముఖం పట్టిందని తెలిపారు. వైద్యుల కొరతకు సంబంధించి 74వ నిబంధన కింద ఎమ్మెల్యే అశోక్ బెండాళం ఇచ్చిన నోటీసు 78పై ముఖ్యమంత్రి వివరణను సభలో యనమల చదివి వినిపించారు. జిల్లా ఎంపిక కమిటీ ద్వారా కాంట్రాక్టు ప్రాతిపదికన అవసరమైన చోట ప్రత్యేక వైద్యులు (గైనకాలజీ, అనస్థీసియా, పీడియాట్రిక్)ను నియమించే విషయమై జిల్లా ఆసుపత్రి సర్వీసుల సమన్వయకర్తకు అనుమతి మంజూరు చేశామన్నారు. రోగులకు ప్రయాణాన్ని తగ్గించేందుకు నెఫ్రాలజిస్టుల కన్సల్టేషన్ కోసం దీర్ఘకాలిక కిడ్నీ వ్యాధిగ్రస్తులకు (సికెడి) సహాయం చేసేందుకు వైద్యాధికారులు ఉపయోగించే టెలిఫోనిక్/వెబ్ ఆధారిత పద్దతుల వంటి వివిధ చర్యలను ప్రభుత్వం చేపట్టిందని తెలిపారు. చంద్రన్న సంచార వైద్యం (మొబైల్ మెడికల్ సర్వీస్‌లు) వంటి ప్రస్తుతం ఉన్న యంత్రాంగాలను అనుసరించాలని రోగులకు సూచించారు. ఇది వ్యాధి పెరుగుదలను నియంత్రించటంలో ఉపకరిస్తుందని చెప్పారు. ఉద్దానం ప్రాంతంలో ఉన్న సోంపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో అధునాతన సౌకర్యాలను ప్రభుత్వం కల్పిస్తోందని ఆరు కమ్యూనిటీ ఆరోగ్య కేంద్రాలకు కిడ్నీ వ్యాధుల కోసం 20 రకాల అదనపు మందులు సరఫరా చేస్తోందని వివరించారు. కిడ్నీ రోగులకు రూ 2500 చొప్పున పింఛను చెల్లిస్తున్నట్లు చెప్పారు. సోంపేట వద్ద సీహెచ్‌సీ, పలాస వద్ద గల మరో సీహెచ్‌సీలో రెండు డయాలసిస్ కేంద్రాలు పనిచేస్తున్నాయని, పాలకొండ, టెక్కలి ఏరియా ఆసుపత్రులు, రిమ్స్, శ్రీకకుళం సమీపంలోని మరో మూడు డయాలసిస్ కేంద్రాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. శ్రీకాకుళం జిల్లా ప్రభావిత ప్రాంతాల్లోని అనుమానిత మూత్రపిండ వైఫల్య రోగులకు రెఫరల్, వైద్య సదుపాయాలకై సీహెచ్‌సీ నుండి తృతీయ సంరక్షణ ఆసుపత్రికి నిరంతర రెఫరల్ పాత్‌వేను నెలకొల్పామని ఆధార్ నుసంధానం ద్వారా సమాచార సాంకేతిక మద్దతు, మూత్ర పిండ వైఫల్య రోగుల గుర్తింపు ఇప్పటికే ఏర్పాటైందని గుర్తుచేశారు. ఎలాంటి డ్రాపవుట్లు లేకుండా పనిచేస్తున్నాయని జిల్లాలో పెరిఫెరల్ ఆసుపత్రులలో పనిచేస్తున్న వైద్యులు, పారామెడికల్ సిబ్బంది క్రమానుగత శిక్షణ విశాఖపట్నం కేజీహెచ్‌లో కొనసాగుతోందని చెప్పారు. ఎన్‌టీఆర్ సుజల స్రవంతి ద్వారా ప్రభావిత ప్రాంతాలకు రక్షిత మంచినీటిని ప్రభుత్వం అందిస్తోందని తెలిపారు. ఉద్దానం ప్రాంతంలోని అన్ని మండలాల్లో 30 సంవత్సరాలకు పైబడిన వయసు కలిగిన వారికి మాస్ స్క్రీనింగ్ చేశారన్నారు. 1,01, 593 మంది ప్రజలను పరీక్షించటం జరిగిందన్నారు. అసాధారణ పరీక్షా ఫలితాలు వచ్చిన 13వేల 93 మందిని ఆ ప్రాంతంలోని సీహెచ్‌సీలకు తరలించామన్నారు. సికెడి సమస్యను వివిధ అంశాల్లో ఆధ్యయనం చేసేందుకు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ నుండి రెండు నిపుణుల బృందాలు, ఐసీఎంఆర్‌తో కలసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటుచేసిన బృందం సంయుక్తంగా ఉద్ధానం ప్రాంతాన్ని సందర్శించిందని, సికెడిని పరీక్షించేందుకు ప్రయోగశాల, పరికరాలు, రీ- ఏజెంట్లను సామాజిక ఆరోగ్య కేంద్రాలకు సమకూర్చామని తెలిపారు. పీహెచ్‌సీలకు సరఫరా చేసేందుకు ఐరన్ సుక్రోజ్ ఇంజక్షన్లను శ్రీకాకుళం కేంద్ర ఔషధ గిడ్డంగిలో అందుబాటులో ఉంచామన్నారు. ఐసీఎంఆర్, జార్జ్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ గ్లోబల్ హెల్త్, ఇండియా భాగస్వామ్యంతో కిడ్నీ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌ను విశాఖపట్నం విమ్స్ వద్ద ఏర్పాటుచేశామన్నారు. సికెడి రోగులకు చికిత్స ప్రోటోకాల్స్‌పై పీహెచ్‌సీ వైద్యాధికారులకు శిక్షణ ఇచ్చామని చెప్పారు. సికెడిల నివారణ, నియంత్రణ నిమిత్తం చేపట్టాల్సిన అంశాలపై సాధికార మిత్రాస్, కమ్యూనిటీలకు అవగాహన కల్పిస్తున్నామని వివరించారు. రోగద నిర్ధారణ, పరిశోధనపై కిడ్నీ వ్యాధి నిపుణులైన డాక్టర్ వివేకానంద ఝా ఆద్వర్యంలో జార్జ్ ఇనిస్టిట్యూట్ ఫర్ గ్లోబల్ హెల్త్ ఇండియా ఉద్ధానం ప్రాంతంలో ఈ ఏడాది జూన్ నుంచి సర్వే, పరిశోధన నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సర్వే, ఇంటర్వ్యూలకు 40 క్లస్టర్లను ఎంపికచేసి ఎంపికచేసిన 2400 మంది వ్యక్తుల నుండి జీవసంబంధ నమూనాలను సేకరించామన్నారు. పది క్లస్టర్లలో సర్వే పూర్తయిందని 600 కుటుంబాలను పరీక్షించామని వీరిలో 334 మంది వ్యక్తులకు రక్త, మూత్ర నమూనాలు సేకరించి విశాఖ మెట్రోపాలిస్ ల్యాబ్‌కు పంపామని తెలిపారు.
దీనిపై అశోక్‌కుమార్ స్పందిస్తూ ప్రాథమిక వైద్య, ఆరోగ్య కేంద్రం వైద్యులు పనిచేసేచోట నివాసం ఉండటంలేదని సభ దృష్టికి తెచ్చారు. దీనిపై చర్యలు తీసుకుంటామని మంత్రి యనమల హామీ ఇచ్చారు.