ఆంధ్రప్రదేశ్‌

కేంద్ర సాయం లేకే అమ్మకానికి బాండ్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, సెప్టెంబర్ 10: ప్రపంచంలోనే అద్భుత రాజధాని నిర్మాణానికి సహకరిస్తానంటూ తిరుపతి ఎన్నికల ప్రచార సభలో హామీ ఇచ్చిన నరేంద్ర మోదీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టి దానిని పూర్తిగా విస్మరించారని, రూ. 1500 కోట్లు ఇచ్చి చేతులు దులుపుకుంటే రాజధాని నిర్మాణం ఎలా సాధ్యపడుతుందంటూ రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పీ నారాయణ ప్రశ్నించారు. అందుకే నిధుల సమీకరణకు ప్రభుత్వం బొంబాయి స్టాక్ ఎక్స్చేంజిలో బాండ్లు అమ్మకానికి పెట్టాల్సి వచ్చిందన్నారు. అయినా సీఎం బాబు సమర్థత, విశ్వసనీయత వల్లనే క్షణాల్లో లక్ష్యానికి రెట్టింపుగా రెండు వేల కోట్లు సమకూరాయని అన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో సోమవారం పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రకుమార్ బాండ్ల గురించి ప్రశ్నించినప్పుడు మంత్రి నారాయణ పై విధంగా బదులిచ్చారు. 217 చ.కి.మీ విస్తీర్ణంలో పార్కులు, భవనాలు, డ్రైన్లు, కేబుల్స్ తదితర వౌలిక సదుపాయాలతో కల్పి రూ. 48వేల కోట్ల వ్యయంతో కూడిన పూర్తి స్థాయి ప్రాజెక్టు నివేదికను కేంద్రానికి పంపించామన్నారు. ఇందులో దాదాపు రూ. 26వేల కోట్లు విలువైన పనులకు టెండర్లను కూడా పిలిచామన్నారు. ఇందు కోసం తొలి విడతగా రూ. 10 వేల కోట్లు రుణంగా అందించడానికి ఆర్థిక సంస్థలు, బ్యాంకులు ముందుకొచ్చాయని, అయితే ప్రభుత్వపరంగా కనీసం 20 శాతం వాటా ధనం సమకూర్చాల్సి రావటంతో బాండ్ల అమ్మకానికి పెట్టాల్సి వచ్చిందన్నారు. కేంద్ర ప్రభుత్వం తాజాగా రాష్ట్రాలను బాండ్ల అమ్మకాలను ప్రోత్సహిస్తూ సబ్సిడీ కూడా అందజేస్తుండటంతో కనీసం రూ. 26 కోట్లు సబ్సిడీ కోసం కేంద్రానికి లేఖ రాశామన్నారు. అయితే విపక్షాలు వాస్తవాలు తెలుసుకోకుండా అనవసర రాద్ధాంతం చేస్తున్నాయన్నారు. డాక్యుమెంటేషన్ ఫీజు కింద 0.85 శాతం చెల్లిస్తూ వడ్డీ 10.32 శాతం చెల్లించాలని నిర్ణయించామన్నారు. తొలుత ధూళిపాళ్ల నరేంద్రకుమార్ మాట్లాడుతూ రాజధాని నిర్మాణానికి మొదటి నుంచి అడ్డంకులు సృష్టిస్తున్నారని, రైతులు స్వచ్ఛందంగా 33వేల ఎకరాలు అందిస్తే అవాస్తవాలతో గ్రీన్‌ట్రిబ్యునల్‌లో పిటిషన్, ప్రపంచ బ్యాంక్‌కు తప్పుడు ఫిర్యాదులు.. ఇలా జరుగుతుంటే ప్రజా రాజధాని నిర్మాణం ఎలా పూర్తి కాగలదని ప్రశ్నించారు. మాజీ మంత్రి గోరంట్ల బుచ్చయ్య చౌదరి మాట్లాడుతూ ‘అమ్మ పెట్టదు.. అడుక్కోనివ్వదన్నట్లు’ బీజేపీ నేతల తీరు ఉందన్నారు. ఈ దశలో బీజేపీ పక్ష నేత పెనె్మత్స విష్ణుకుమార్ రాజు కల్పించుకుంటూ పదవులు, వచ్చే ఎన్నికల్లో సీటుకై చంద్రబాబు మెప్పుకోసం ఏదో మాట్లాడుతున్నారని, రాజధాని నిర్మాణానికి మోదీ తనవంతు సహాయం చేయగలరని అన్నారు. దీనిపై టీడీపీ సభ్యులు ఒక్కసారిగా నిరసర తెలుపుతుంటే విష్ణుకుమార్ రాజు మరింతగా రెచ్చపోయి ‘ఏమి మాట్లాడుతున్నారయ్యా కూర్చొండి’ అంటూ కొన్ని విసుర్లు విసరారు. స్పీకర్ కోడెల శివప్రసాదరావు జోక్యం చేసుకుంటూ అప్రజాస్వామిక వ్యాఖ్యలను తక్షణం ఉపసంహరించుకోవాలని కోరారు. తాను ఆ మాటలను విరమించుకుంటున్నానని చెప్పడంతో వివాదం సర్దుమణిగింది.
అనుకున్న సమయానికే రాజధాని నిర్మాణం
ఎన్ని అడ్డంకులు సృష్టించినా, రాజధాని అమరావతి నిర్మాణాన్ని అనుకున్న సమయానికే పూర్తి చేస్తామని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి నారాయణ స్పష్టం చేశారు. రాష్ట్ర శాసన మండలిలో రాజధాని అభివృద్ధిపై లఘు చర్చ సోమవారం జరిగింది. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ వచ్చే మార్చినాటికి నిర్మాణం పూర్తి చేస్తామని, కోర్టు భవనాల నిర్మాణానికి రెండు సంవత్సరాలు పడుతుందన్నారు.
రాష్ట్రాన్ని విభజించినప్పుడు రాజధాని ఎక్కడ నిర్మించాలన్న అంశాన్ని ఖరారు చేసేందుకు శివరామకృష్ణ కమిటీని నియమించారన్నారు. కానీ స్పష్టమైన ప్రాంతాన్ని ఎంపిక చేయకుండా వదిలేసిందన్నారు.వెలగపూడిలోని తాత్కాలిక రాజధానికి చదరపు అడుగుకు 10 వేల రూపాయలు ఖర్చు చేశామని ఆరోపణలు చేస్తున్నారని, ఇందులో నిజం లేదన్నారు. రాజధాని భవనాల నిర్మాణానికి చదరపు అడుగుకు 2963 రూపాయలు, అంతర్గక సదుపాయాలకు, మంగళగిరి నుంచి పైపులైనుకు కలిపి చదరపు అడుగుకు 8400 రూపాయలు అయిందన్నారు.